- Telugu News Photo Gallery Spiritual photos Mercury transit 2025: these three Zodiac Signs are get good luck
Budha Gochar: బుధ సంచారం.. నవరాత్రుల్లో ఈ 3 రాశులకు ఊహించని జాక్ పాట్
నవ గ్రహాల్లో రాకుమారుడు బుధుడు. పాలనా శక్తి, తెలివితేటలు, కమ్యూనికేషన్, సమతుల్యతకు ప్రాతినిధ్యం వహిస్తాడు. బుధుడు సెప్టెంబర్ 15న తన రాశి మార్చుకున్నాడు. ఈ సంచారము కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. బుధ సంచారంతో నవరాత్రులలో కొన్ని రాశుల వారికి అనేక ప్రయోజనాలు కలగానున్నాయి. మొత్తానికి వీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం..
Updated on: Sep 17, 2025 | 11:55 AM

జ్యోతిషశాస్త్రంలో గ్రహాల కదలిక , వాటి రాశి మార్పులు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి ఎందుకంటే అవి ఒక వ్యక్తి జీవితం, వృత్తి, ఆర్థిక పరిస్థితి, సంబంధాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 15, 2025 ఆదివారం ఉదయం 11:07 గంటలకు.. బుధుడు సింహరాశి నుంచి బయలుదేరి కన్యారాశిలోకి ప్రవేశించాడు. ఈ బుధ సంచారము అక్టోబర్ 2, 2025 వరకు ఉంటుంది.

బుధుడు విద్య, తెలివితేటలు, తార్కికం, వాక్చాతుర్యం, వ్యాపారం ,కమ్యూనికేషన్ కారకంగా పరిగణించబడుతున్నాడు. దీంతో బుధుడు రాశి మార్పు చాలా మందికి ఫలవంతమైనదిగా నిరూపించబడుతుంది. ముఖ్యంగా కన్య, మకరం, మీన రాశులకు అదృష్టం ఈ సమయంలో ప్రకాశిస్తుంది.

కన్యా రాశి: బుధుడు తన సొంత రాశి అయిన కన్యారాశిలోకి ప్రవేశించినందున బుధ సంచారము కన్యరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సంచారము వీరి తార్కిక సామర్థ్యాలను, నిర్ణయం తీసుకోవడాన్ని మెరుగుపరుస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పదోన్నతి లభించే అవకాశాలు ఉన్నాయి. సహోద్యోగులు, ఉన్నతాధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మంచి వ్యాపార ఒప్పందం కూడా ఖరారు కావచ్చు. వ్యాపారస్తులకు ఈ సమయం లాభాలను పెంచుతుంది. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. కృషి తగిన ఫలాలను అందుకుంటారు. పరీక్షలలో బాగా రాణిస్తారు. వ్యక్తిగత జీవితంలో, సంబంధాలు మధురంగా మారతాయి. కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి.

మకర రాశి: బుధ సంచారము మకర రాశి వారికి అదృష్ట ద్వారాలను తెరుస్తుంది. ఈ కాలంలో వీరు ప్రయత్నాలకు తగిన ప్రతిఫలాలను పొందుతారు. వృత్తి, వ్యాపర రంగంలో ఉన్న వారి పురోగతికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. పనిలో ఒక పెద్ద ప్రాజెక్ట్‌ను పొందవచ్చు. దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఊహించని విధంగా ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉంటారు. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కోలుకుని ఉత్సాహంగా ఉంటారు.

మీన రాశి: మీన రాశి వారికి బుధ సంచారము వృత్తి , సామాజిక ప్రతిష్టకు చాలా శుభప్రదం. ఉద్యోగులు పదోన్నతి పొందే బలమైన అవకాశం ఉంది. కృషికి తగిన గౌరవం, ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో కొత్త క్లయింట్లతో కూడా కనెక్ట్ అవుతారు. వ్యాపార విస్తరణకు దారితీస్తుంది. వీరి సంబంధం జీవిత భాగస్వామితో బలపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువ సమయం గడుపుతారు.. భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది. సామాజిక కార్యకలాపాల్లో మీ భాగస్వామ్యం పెరుగుతుంది. సమాజంలో గౌరవాన్ని పొందుతారు.




