గ్యాంగ్ స్టర్ భార్యతో గ్యాంగ్‌లోని వ్యక్తి అక్రమ సంబంధం.. చివరకు ఊహించని ట్విస్ట్
గ్యాంగ్ స్టర్ భార్యతో గ్యాంగ్‌లోని వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకోవడం సంచలనంగా మారింది. చాలా రోజుల పాటు ఈ విషయం ఎవరి కంట పడకుండా ఈ జంట బాగానే మెయింటైన్ చేసింది. కానీ ఒక రోజు బైక్‌పై బయటకు వెళ్లినప్పుడు ఊహించని ఘటన జరిగింది. దీంతో ఈ విషయం అందరికీ తెలిసింది. ఇప్పుడు గ్యాంగ్ మొత్తం అతడి కోసం వెతుకుతోంది.

ఓ పెద్ద గ్యాంగ్ స్టర్.. అతడిని చూస్తే అంతా భయపడతారు. కానీ భార్య తప్ప.. అవును గ్యాంగ్ స్టర్ అని తెలిసి కూడా భార్య ఆ గ్యాంగ్‌లోని మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. చివరకు ఈ మ్యాటర్ గ్యాంగ్‌లోని అందరికీ తెలిసి.. అతడిని చంపడానికి సిద్ధమవుతారు. ఇదంతా వింటుంటే ఏదైనా సినిమా స్టోరీ విన్నట్లుగా ఉందా. చాలా కమర్షియల్ సినిమాల్లో ఇటువంటి స్టోరీలే ఉంటాయి. కానీ ఇప్పటివరకు చెప్పింది.. సినిమా సీన్ కాదు. రియల్ సీన్. ఇది మహారాష్ట్రలో జరిగింది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ నెలకొంది. ఓ ప్రమాదంలో మహిళ చనిపోవడంతో ఈ గ్యాంగ్‌కు అసలు విషయం తెలిసింది. దీంతో కత్తులు పట్టుకుని సదరు వ్యక్తిని వేసేసేందుకు వీధుల్లో తిరుగుతున్నారు. మరోవైపు సంబంధం పెట్టుకున్న గ్యాంగ్ మెంబర్ బిక్కబిక్కుమంటూ బతుకుతున్నాడు.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఇప్పా గ్యాంగ్ ఉంది. ఈ ముఠాలో 40మంది ఉంటారు. ఇప్పుడు వీరంతా ఈ గ్యాంగ్ లోని ఓ వ్యక్తిని చంపేందుకు కాంప్టీ శివారు ప్రాంతాల్లో వేట సాగిస్తున్నారు. ఎందుకంటే తమ లీడర్ భార్యతో ఈ గ్యాంగ్‌లోని అర్షద్ టోపి అనే వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఎవరికీ తెలియదు. మూడు రోజుల క్రితం ఈ జంట బైక్ వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. వీరి బైక్ జేసీబీని ఢీకొట్టగా.. మహిళకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమెను నాగ్‌పూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఆమె మరణంతో వీరి సంబంధం బయటి ప్రపంచానికి తెలిసింది.
ఈ నేపథ్యంలో గ్యాంగ్‌లోని ఇతర సభ్యులంతా అర్షద్‌ను చంపేందుకు తిరుగుతున్నారు. ఎక్కడ దొరికితే అక్కడే వేసేద్దామని కత్తులతో వేటాడుతున్నారు. ఈ క్రమంలో తనకు ప్రాణహాని ఉందని అర్షద్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అతని వద్ద నుంచి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. అయితే మహిళ నిజంగానే ప్రమాదంలో మరణించిందా..? లేక హత్య చేశారా అన్నదిదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు అర్షద్ మాత్రం.. ఎప్పుడు.. ఎవరు.. ఏ వైపు నుంచి వచ్చి అటాక్ చేస్తారో తెలియక ప్రాణభయంతో కాలం వెల్లదీస్తున్నాడు.
మరన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.