AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Special Trains: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తిరుపతి, కాచిగూడ రూట్లలో 48 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు ఇవే!

రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో, ప్రయాణికుల రద్దీ దృష్ట్రా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉండే రూట్‌లలో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పలు ముఖ్యమైన మార్గాల్లో మొత్తం 48 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది.

Special Trains: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తిరుపతి, కాచిగూడ రూట్లలో 48 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు ఇవే!
Special Trains
Anand T
|

Updated on: Jul 06, 2025 | 4:01 PM

Share

రోజురోజుకూ పెరుగుతున్న రైల్వే ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు, వారికి ఇబ్బందులను తగ్గించి, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు  దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో 48 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు తిరుపతి-హిసార్ మధ్య 12 సర్వీసులను నడపనున్నట్టు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈ మార్గంలో నడిచే రైళ్లు ప్రతి బుధ, ఆదివారాల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని రైల్వేశాఖ పేర్కొంది. అదే విధంగా, కాచిగూడ-తిరుపతి మధ్య కూడా ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మార్గాల్లో ప్రతి గురు, శుక్రవారాల్లో 8 ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించిననున్నారు.

ఇక రైల్వేశాఖ నడపనున్న ప్రత్యేక రైళ్లలో అత్యధికంగా నరసాపూర్-తిరువణ్ణామలై మార్గంలో 16 ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నారు. ఈ మార్గాల్లో బుధ, గురువారాల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసులన్ని జులై 9 నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వేశాఖ స్పష్టం చేసింది.

అయితే ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేందుకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా రైల్వే శాఖ కల్పించింది. ఈ అవకాశాన్ని ప్రయాణికులందరూ సద్వినియోగం చేసుకోవాలని రైల్వే శాఖ సూచించారు. ట్రైన్‌ టైమింగ్స్‌, ఇతర పూర్తి వివరాల కోసం రైల్వేశాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు తెలిపారు.

మరన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..