AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఇంట్లో నాటకుండానే తులసి మొక్క మొలిచిందా..? అయితే, ఇది తెలుసుకోండి!

హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కను అత్యంత పవిత్రమైనదిగా, లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇంట్లో పూల కుండీలలో లేదా నివాస ప్రాంతంలో మనం నాటకుండానే అకస్మాత్తుగా లేదా స్వయంచాలకంగా తులసి మొక్క మొలకెత్తితే, అది అత్యంత శుభ సంకేతమని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. స్వయంగా మొలిచిన తులసి మొక్క వల్ల ఆ ఇంటిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది. జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే..

మీ ఇంట్లో నాటకుండానే తులసి మొక్క మొలిచిందా..? అయితే, ఇది తెలుసుకోండి!
Tulsi Growing Naturally
Jyothi Gadda
|

Updated on: Aug 06, 2026 | 2:07 PM

Share

హిందూ ధర్మంలో తులసి మొక్క లేని ఇల్లు ఉండదు. నిత్యం తులసిని పూజించడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని విశ్వసిస్తారు. సాధారణంగా మనం తులసి విత్తనాలు నాటి లేదా కొత్త మొక్క తెచ్చి పెంచుకుంటూ ఉంటాం. కానీ, కొన్నిసార్లు మనం నాటకుండానే ఇంట్లో పూల కుండీలలో లేదా ఖాళీ ప్రదేశాల్లో స్వయంచాలకంగా తులసి మొక్క మొలకెత్తుతుంది. ఆధ్యాత్మికం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది సాధారణ విషయం కాదు.. అత్యంత శుభప్రదమైన దైవిక సంకేతం.

నాటకుండానే తులసి మొలకెత్తడం వెనుక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత:

లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అనుగ్రహం: తులసి మొక్క విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఇంట్లో స్వయంగా తులసి మొక్క పెరగడం అంటే ఆ కుటుంబంపై లక్ష్మీనారాయణుల పవిత్ర ఆశీస్సులు ఉన్నాయని అర్థం. ఇది భవిష్యత్తులో కలగబోయే ధనలాభానికి, ఐశ్వర్యానికి సూచిక.

ప్రతికూల శక్తుల నివారణ: తులసి మొక్కకు ఇంట్లోని వాస్తు దోషాలను, ప్రతికూల శక్తులను పీల్చుకుని, అనుకూల శక్తులను ప్రసరింపజేసే దివ్యమైన శక్తి ఉంది. అకస్మాత్తుగా తులసి మొలవడం వల్ల ఇంట్లోని కష్టాలు, ఆటంకాలు తొలగిపోతాయని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

కుటుంబంలో ప్రశాంతత, సంతోషం: మనం నాటకుండానే తులసి మొక్క వచ్చిందంటే ఆ ఇంట్లో ఉన్న మనస్పర్థలు, గొడవలు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

స్వయంగా మొలిచిన తులసిని ఎలా సంరక్షించాలి?

స్వయంగా మొలిచిన తులసి మొక్కను తొలగించకుండా, దాన్ని ఒక పవిత్రమైన కుండీలోకి మార్చి రోజూ నీరు పోస్తూ సంరక్షించాలి. తులసి మొక్క ఉన్న ప్రదేశంలో అపరిశుభ్రత లేకుండా చూసుకోవాలి. సాయంత్రం వేళల్లో తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంట్లో స్వయంచాలకంగా తులసి మొక్క మొలకెత్తడం అనేది లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతోందనడానికి ఒక స్పష్టమైన శుభ సంకేతం!

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
క్యాలీఫ్లవర్ అతిగా తింటున్నారా..? వీరికి విషంతో సమానం
క్యాలీఫ్లవర్ అతిగా తింటున్నారా..? వీరికి విషంతో సమానం
కొలంబోలో భారీ విక్టరీ దిశగా భారత్.. WTC టేబుల్ లో భారీ జంప్..?
కొలంబోలో భారీ విక్టరీ దిశగా భారత్.. WTC టేబుల్ లో భారీ జంప్..?
నేటి నుంచే AP ICET 2026 ప్రవేశాలు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ
నేటి నుంచే AP ICET 2026 ప్రవేశాలు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ
పసిడి ధర మరింత పెరుగుతుందా..? పెట్టుబడులకు ఇదే బెస్ట్ టైమా..?
పసిడి ధర మరింత పెరుగుతుందా..? పెట్టుబడులకు ఇదే బెస్ట్ టైమా..?
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్..
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్..
కృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 3నా.. 4నా? పూజ, నిశిత కాలం, ఉపవాస..
కృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 3నా.. 4నా? పూజ, నిశిత కాలం, ఉపవాస..
ఒకే ఓవర్లో 2 వికెట్లతో చెలరేగిన బుడ్డోడు.. సెలబ్రేషన్స్ చూశారా..?
ఒకే ఓవర్లో 2 వికెట్లతో చెలరేగిన బుడ్డోడు.. సెలబ్రేషన్స్ చూశారా..?
ఇరుముడి టీచర్ ఒకప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్ తెలుసా..
ఇరుముడి టీచర్ ఒకప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్ తెలుసా..
RRB NTPC UG 2026 ఫలితాలు వచ్చేశాయ్‌.. స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్
RRB NTPC UG 2026 ఫలితాలు వచ్చేశాయ్‌.. స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్
ఇరాన్ ఉద్రిక్తతలు-వాషింగ్టన్ వ్యూహాన్ని తప్పుబట్టిన బీజింగ్!
ఇరాన్ ఉద్రిక్తతలు-వాషింగ్టన్ వ్యూహాన్ని తప్పుబట్టిన బీజింగ్!