Tripura CM: త్రిపుర సీఎం బిప్లబ్ దేబ్ పై హత్యాయత్నం.. ముగ్గురు యువకుల అరెస్ట్..
త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్ మీద హత్యా యత్నం జరిగింది. ఆయన ఈవెనింగ్ వాక్ చేస్తుండగా ఓ కారు అతి వేగంగా దూసుకు రావడంతో అప్రమత్తంగా ఉన్న ఆయన వెంటనే పక్కకు తొలిగారని పోలీసులు తెలిపారు.
త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్ మీద హత్యా యత్నం జరిగింది. ఆయన ఈవెనింగ్ వాక్ చేస్తుండగా ఓ కారు అతి వేగంగా దూసుకు రావడంతో అప్రమత్తంగా ఉన్న ఆయన వెంటనే పక్కకు తొలిగారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఆయన భద్రతా సిబ్బందిలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయన్నారు. ఈ నెల 5 వ తేదీ సాయంత్రం బిప్లబ్ దేబ్ తన అధికారిక నివాసం వద్ద నడుస్తుండగా ఆయన సెక్యూరిటీ వలయాన్ని ఛేదించుకుని ఈ వాహనం వేగంగా వచ్చిందని, వెంటనే ఆయన పక్కకు తొలిగారని వారు చెప్పారు. అప్పుడే ఆ కారును ఆపడానికి యత్నించినా ఫలితం లేకపోయిందని, అయితే దర్యాప్తు జరిపి..మరుసటి రోజు రాత్రి.. కెర్చ్ నుమానీ అనే ప్రాంతానికి చెందిన ముగ్గురిని అరెస్టు చేశామని వారు వెల్లడించారు. పోలీసులు ఆ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.
సుమారు 20, 25 ఏళ్ళ వయసున్న ఈ ముగ్గురినీ కోర్టులో హాజరు పరచగా వీరికి 14 రోజుల జుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది. ఈ ముగ్గురినీ శుభం సాహో, అమన్ సాహో, గైరిక్ ఘోష్ గా గుర్తించారు. ముఖ్యమంత్రిపై హత్యా యత్నం, ర్యాష్ డ్రైవింగ్ తదితర అభియోగాలను వీరిపై మోపారు. జెడ్ ప్లస్ భద్రత ఉన్న త్రిపుర సీఎంకి గతంలోనే బెదిరింపులు అందాయని అధికారులు తెలిపారు. మయన్మార్ నుంచి డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుంటూ ఈయన లోగడ ఉత్తర్వులు జారీ చేశారు. అదీకాక.. త్రిపురలో ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. సీఎం సెక్యూరిటీ సిబ్బంది విధులను ఈ యువకులు అడ్డుకునే ప్రయత్నం చేశారని కూడా వీరిపై కేసు నమోదయింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Covid 19 Vaccine: భారత్‌లో అందుబాటులోకి మరో కోవిడ్-19 వ్యాక్సిన్.. జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Viral Video: ఇంకా నయం వధువు కొట్టలేదు.. వరుడి స్నేహితులు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారో తెలుసా.. వీడియో