Covid 19 Vaccine: భారత్‌లో అందుబాటులోకి మరో కోవిడ్-19 వ్యాక్సిన్‌.. జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

దేశంలో మరో వ్యాక్సిన్‌ అందుబాటులోకొచ్చింది. అమెరికా కంపెనీ అభివృద్ధి చేసిన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌.. సింగిల్‌ డోస్ టీకాకు కేంద్రం అనుమతిచ్చింది.

Covid 19 Vaccine: భారత్‌లో అందుబాటులోకి మరో కోవిడ్-19 వ్యాక్సిన్‌.. జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Johnson Covid Vaccine
Follow us

|

Updated on: Aug 07, 2021 | 2:06 PM

Covid 19 Johnson & Johnson: దేశంలో మరో వ్యాక్సిన్‌ అందుబాటులోకొచ్చింది. అమెరికా కంపెనీ అభివృద్ధి చేసిన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌.. సింగిల్‌ డోస్ టీకాకు కేంద్రం అనుమతిచ్చింది.జాన్సన్ టీకాతో దేశంలో మొత్తం 5 కంపెనీల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు కేంద్రమంత్రి మాండవీయ. ఈ నెల 5న అత్యవసర అనుమతి కోసం జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. కరోనా నియంత్రణలో తమ వ్యాక్సిన్‌ చాలా చక్కగా పనిచేస్తుందని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ప్రకటించింది. మిగతా వ్యాక్సిన్లతో పోలిస్తే ఈ టీకా సింగిల్‌ డోస్‌ వేసుకుంటే సరిపోతుంది. అమెరికాలో సక్సెస్‌ రేటు ఎక్కువ కావడంతో ఈ వ్యాక్సిన్‌ వేసుకోవడానికి జనం ఆసక్తి చూపుతున్నారు.

ఇక ఇప్పటికే మన దేశంలో 3 వ్యాక్సిన్స్‌ అందుబాటులో ఉన్నాయి. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌ టీకాలను ప్రజలకు ఇస్తున్నారు. కరోనా విజృంభణతో దేశంలో వ్యాక్సిన్‌కు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంలో భాగంగా విదేశాలకు చెందిన వ్యాక్సిన్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతోంది. ఇదే క్రమంలో భారత్‌లో అత్యవసర వినియోగానికి మరో కోవిడ్-19 వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చామని కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ తెలిపారు. కోవిడ్-19పై కలసికట్టుగా చేస్తున్న యుద్ధానికి ఈ నిర్ణయం ఊతమిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో వెల్లడించారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా.

మరోవైపు, పెద్దల కోసం కొవావాక్స్​టీకాను ఈ ఏడాది అక్టోబర్​లో విడుదల చేయాలనుకుంటున్నట్లు సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా సీఈఓ అదర్​ పూనావాలా ప్రకటించారు. వచ్చే ఏడాది ఫస్ట్‌ క్వార్టర్‌లో పిల్లలకు వినియోగించేందుకు ఈ టీకాను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ మేరకు హోం మంత్రి అమిత్​ షాతో సమావేశం అనంతరం ఈ ప్రకటన చేశారు పూనావాలా..దాదాపు 30 నిమిషాలపాటు వారిద్దరూ భేటీ అయ్యారు.

Read Also.. Viral Video: ఇంకా నయం వధువు కొట్టలేదు.. వరుడి స్నేహితులు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారో తెలుసా.. వీడియో

నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..