White Fungus: షాకింగ్ న్యూస్.. కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తి మెదడులో.. వైట్ ఫంగస్, చీము
White Fungus Detected in Brain: దేశంలో కరోనావైరస్ అలజడి సృష్టిస్తోంది. సెకండ్ వేవ్ అనంతరం కేసులు తగ్గినప్పటికీ.. కరోనాలోని పలు వేరియంట్లు కలవరపెడుతున్నాయి. దీంతోపాటు
White Fungus Detected in Brain: దేశంలో కరోనావైరస్ అలజడి సృష్టిస్తోంది. సెకండ్ వేవ్ అనంతరం కేసులు తగ్గినప్పటికీ.. కరోనాలోని పలు వేరియంట్లు కలవరపెడుతున్నాయి. దీంతోపాటు బ్లాక్‌ఫంగస్, వైట్ ఫంగస్ ప్రభావం కూడా ఆందోళనకు గురిచేస్తోంది. అయితే.. తాజాగా వైట్ ఫంగస్ మెదడులోకి కూడా ప్రవేశించి.. ఏకంగా చీమునే సృష్టించింది. కరోనా సోకి నయమైన రోగి మెదడులో వైట్‌ఫంగస్‌ను కనుగొన్నట్లు హైదరాబాద్ వైద్యులు తెలిపారు. అయినా ఆ రోగికి మధుమేహం కూడా లేదని తెలిపారు. దేశంలో మొట్టమొదటి సారిగా ఇలాంటి కేసు తెలంగాణలోని హైదరాబాద్‌లో బయటపడటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
కరోనా నుంచి కోలుకున్న రోగి మెదడులో వైట్ ఫంగస్ చీము(ఆస్పెర్‌గిల్లస్) ఏర్పడింది. ఈ రోగి మేలో కోవిడ్ నుంచి కోలుకున్నారు. అప్పట్లోనే అవయవాల బలహీనత, మాట్లాడటం కష్టంగా ఉన్నట్లు వైద్యుల దృష్టికి తీసుకొచ్చారని సమాచారం. మందులు తీసుకున్న తర్వాత కూడా గడ్డలు ఏర్పడ్డాయని మెదడు స్కాన్ చేయడంతో.. ఇదంతా తెలిసిందని డాక్టర్లు తెలిపారు. శస్త్రచికిత్స తర్వాత ఇప్పుడు రోగి మెదడులో వైట్ ఫంగస్‌తోపాటు చీము ఏర్పడిందని పేర్కొంటున్నారు.
మెదడులో వైట్ ఫంగస్‌తోపాటు చీము ఏర్పడటాన్ని అరుదైన కేసుగా.. సన్‌షైన్ హాస్పిటల్‌కు చెందిన సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ పి రంగనాథం తెలిపారు. సాధారణంగా కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఇన్‌ఫెక్షన్ వస్తుందని.. మధుమేహ వ్యాధిగ్రస్తులైతే లక్షణాలు అధికంగా కనిపిస్తాయన్నారు. కానీ ఈ రోగికి మధుమేహం లేదని అయినా.. ఫంగస్ వ్యాపించినట్లు వెల్లడించారు. బ్లాక్ఫంగస్వలే.. వైట్ ఫంగస్ మెదడులోకి వెళ్లలేదన్నారు. ఆస్పెర్‌గిల్లస్ ద్వారా మెదడు వాపు రావడం సాధారణం అయినప్పటికీ.. చీము ఏర్పడే వైట్ ఫంగస్ కేసులు బయటకు రావడం అరుదని పేర్కొన్నారు.
Also Read: