AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Fake Test: కుంభ మేళాలో లక్ష ఫేక్ కోవిడ్ టెస్టులు.. 5 ల్యాబ్ లపై ఈడీ దాడులు..

ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో గత ఏప్రిల్ లో జరిగిన కుంభ్ మేళాలో సుమారు లక్ష ఫేక్ కోవిడ్ టెస్టులు నిర్వహించారన్న వార్తలు దేశంలో సంచలనం సృష్టించాయి. వీటిపై దృష్టి పెట్టిన ఈడీ..

Covid Fake Test: కుంభ మేళాలో లక్ష ఫేక్ కోవిడ్ టెస్టులు.. 5 ల్యాబ్ లపై ఈడీ దాడులు..
Kumbh Mela
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Aug 07, 2021 | 5:23 PM

Share

ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో గత ఏప్రిల్ లో జరిగిన కుంభ్ మేళాలో సుమారు లక్ష ఫేక్ కోవిడ్ టెస్టులు నిర్వహించారన్న వార్తలు దేశంలో సంచలనం సృష్టించాయి. వీటిపై దృష్టి పెట్టిన ఈడీ.. అయిదు ల్యాబ్ లపై దాడులు జరిపి దాదాపు 31 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకుంది. వీటి యజమానుల ఇళ్ళు, కార్యాలయాలపై ఏక కాలంలో సోదాలు, దాడులు జరిపి ఈ సొమ్మును సీజ్ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. డెహ్రాడూన్, హరిద్వార్, ఢిల్లీ, నొయిడా, హిసార్ లలోని నోవిస్ ప్యాథ్ ల్యాబ్స్, మాక్స్ కార్పొరేట్ సర్వీసెస్, లాల్ చందానీ ల్యాబ్స్, నల్వా లేబొరేటరీస్, వీటిలో ఉన్నాయి. గత జూన్ లోనే ఉత్తరాఖండ్ సిట్ బృందం ఢిల్లీ లోని మాక్స్ కార్పొరేట్ సర్వీసెస్, హర్యానాలోని నల్వా లేబొరేటరీస్, లాల్ చందానీ ల్యాబ్స్ కు నోటీసులు జారీ చేసింది. ఈ సంస్థల యజమానులనుంచి స్టేట్ మెంట్లను రికార్డు చేశారు. కుంభ్ మేళాకు హాజరైన భక్తులు, యాత్జ్రికులకు నిర్వహించిన కోవిడ్ టెస్టుల్లో సుమారు లక్ష టెస్టులు బూటకమని వార్తలు రావడంతో సిట్ దర్యాప్తు చేసింది. టెస్టుల నిర్వహణకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం 11 ప్రైవేటు ల్యాబ్ లకు అధికారమిచ్చింది.

మాక్స్ కార్పొరేట్ సర్వీసెస్, నల్వా ల్యాబ్స్, లాల్ చందానీ ల్యాబ్స్ ను ఇవిఅద్దెకు తీసుకున్నాయని, ఇవి లక్షకు పైగా ఫేక్ టెస్టులు జరిపాయని తెలిసింది. భక్తుల నుంచి శ్వాబ్ కలెక్షన్ గానీ, టెస్టులు గానీ చేయకుండానే వట్టి కాగితాల మీద చేసినట్టు చూపినట్టు వెల్లడైంది. ఆ మేళాలో రెండున్నర వేలమందికి పైగా కోవిడ్ పాజిటివ్ కి గురయ్యారు. వారిలో 200 మంది సాధువులు కూడా ఉన్నారు. 70 రోజుల ఆ ఈవెంట్ కి దాదాపు 70 లక్షలమంది హాజరయ్యారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Aadi Sai Kumar’s Black Movie: తొలిసారిగా పోలీస్ గెటప్‌‌‌లో ఆది సాయి కుమార్.. ఆకట్టుకుంటున్న బ్లాక్ టీజర్

Kannada Actress Ashika Ranganath: పట్టుపరికినిలో బుట్టబొమ్మ .. చందమామే చిన్నబోయే సొగసైన చిన్నది..