Manasa Murder Case: డెంటల్‌ హౌస్ సర్జన్ మానస హత్య కేసులో మరో టర్న్..

కేరళ కొచ్చిలో జరిగిన డెంటల్‌ హౌస్ సర్జన్ మానస హత్య కేసు మరో టర్న్‌ తీసుకుంది. ఈ కేసులో మరొకరి ప్రమేయమున్నట్లుగా...

Manasa Murder Case:  డెంటల్‌ హౌస్ సర్జన్ మానస హత్య కేసులో మరో టర్న్..
Medical Student Manasa Murd
Follow us

|

Updated on: Aug 07, 2021 | 3:13 PM

కేరళ కొచ్చిలో జరిగిన డెంటల్‌ హౌస్ సర్జన్ మానస హత్య కేసు మరో టర్న్‌ తీసుకుంది. ఈ కేసులో మరొకరి ప్రమేయమున్నట్లుగా తేల్చారు పోలీసులు. మానస హత్యపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు..రాఖిల్‌కు తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందన్న అంశంపై కూపీ లాగారు. బీహార్‌లోని మంగేర్‌ జిల్లా ఖప్రతారా ఏరియాకు చెందిన 21ఏళ్ల సోను కుమార్…రాఖిల్‌కి తుపాకీ ఇచ్చినట్లు గుర్తించారు. బీహార్‌ పోలీసుల సహకరాంతో అతన్ని అరెస్ట్‌ చేశారు. సోనుకుమార్‌ను మంగేర్‌ మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. ఇక మానసను చంపేసిన రాఖిల్…ఓ ఉబెర్‌ టాక్సీ డ్రైవర్‌ సాయంతో కేరళ నుంచి బీహార్‌కి వెళ్లినట్లు తేల్చారు. అక్కడ సోను దగ్గర నాటు తుపాకీ కొని కేరళలోని కొత్తమంగళంకు వచ్చి మానసకు దగ్గర్లోనే ఓ రూం అద్దెకు తీసుకున్నాడు. ఆమెను ఎలా చంపాలి..? ఎప్పుడు చంపాలి అని ప్లాన్‌ వేసుకున్నాడు. ఆ తర్వాత పట్టపగలే ఆమె ఉంటున్న ఇంట్లోకి చొరబడి.. మానసను తుపాకీతో కాల్చి హతమార్చాడు. ఆపై తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు రాఖిల్. దీంతో ఇప్పుడు ఆ ఉబెర్‌ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

అసలు కేసు ఏంటంటే…

పీవీ మానస… కేరళలోని కన్నూరు దగ్గర నెల్లికుళ్లిలో ఉన్న ఇందిరా గాంధీ డెంటల్ కాలేజీలో హౌస్ సర్జన్‌గా పనిచేస్తోంది. 2 ఏళ్ల కిందట ఆమెకు రాఖిల్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ద్వారా కలిశాడు. ఆ తర్వాత వారి మధ్య స్నేహం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. రాఖిల్… ఆమెను ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. దానిపై ఆమె నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఆ తర్వాత నుంచి అతని ప్రవర్తన మారింది. నువ్వు ఏ అబ్బాయిలతోనూ మాట్లాడొద్దు, ఎక్కువ సేపు మొబైల్ వాడొద్దు, చాటింగ్ చెయ్యొద్దు అంటూ ఆధిపత్యం చూపించడం ప్రారంభించాడు. దీంతో మాసన అతన్ని దూరం పెట్టడం ప్రారంభించింది. వేధింపులు పెరగడంతో  పేరెంట్స్‌ చెప్పి పోలీసులకు కంప్లైంట్ చేసింది. కన్నూర్ పోలీసులు ఇద్దరి మధ్యా రాజీ కుదిర్చారు. ఇకపై తాను ఆమె జోలికి వెళ్లను అని పోలీసుల ముందు ఒప్పుకోవడంతో… కేసు పెట్టలేదు. దీంతో ఆమెపై పగ పెంచుకున్న రాఖిల్.. తనకు దక్కని అమ్మాయి ఇంకెవరికీ దక్కడానికి వీల్లేదు అనుకున్నాడు.  గత వారం ఆమెను గన్‌తో కాల్చి చంపి… తర్వాత తానూ సూసైడ్ చేసుకున్నాడు.

Also Read:  వైఎస్ వివేకా హత్య కేసులో కీలక అప్‌డేట్.. మారణాయుధాల కోసం అక్కడ గాలింపు

కాలనీలో ఆడుకుంటున్న చిన్నారులు.. ఇంతలో దూసుకొచ్చిన కొత్త కారు.. షాకింగ్ దృశ్యాలు..