Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Building Collapse: కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. పెరుగుతున్న మృతుల సంఖ్య.. పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

కుర్లా ప్రాంతంలోని ఓ స్లమ్ ఏరియాలో ఉన్న నాలుగంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికితీసేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో

Building Collapse: కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. పెరుగుతున్న మృతుల సంఖ్య.. పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Kurla Building
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 28, 2022 | 9:34 PM

ముంబయిలోని కుర్లా ప్రాంతంలో ఓ నాలుగు అంతస్తుల భవనం సోమవారం అర్ధరాత్రి కుప్పకూలింది. ఈ ఘటనలో మృతి చెందినవారి సంఖ్య ప్రస్తుతం 18కి పెరిగింది. సమాచారం తెలిసిన వెంటనే ఎన్‌డీఆర్ఎఫ్, బీఎంసీ, ముంబయి అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులకు రాజావాడి, సియాన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. గత కొన్నిరోజలుగా ముంబయి నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుర్లా ప్రాంతంలోని ఓ స్లమ్ ఏరియాలో ఉన్న నాలుగంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికితీసేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో 20 మంది గాయపడగా, వారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. కాగా, కూలిపోయిన భవనాన్ని ఆనుకుని ఉన్న భవనాల పరిస్థితి కూడా ప్రమాదకరంగా ఉన్నట్టు గుర్తించారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో భవనం కూలిన సమాచారం అందింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కార్పొరేటర్ ప్రవీణ్ మోర్జ్కర్ విలేకరులతో మాట్లాడుతూ..ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 12 మందిని కాపాడినట్లు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

ఇవి కూడా చదవండి

రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే ప్రమాద ప్రాంతాన్ని సందర్శించి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష పరిహారం ప్రకటించింది ప్రభుత్వం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సిల్వర్‌ స్క్రీన్‌ మీద రామనామస్మరణ.. హనుమాన్ జయంతి అప్డేట్స్ ఇవే.
సిల్వర్‌ స్క్రీన్‌ మీద రామనామస్మరణ.. హనుమాన్ జయంతి అప్డేట్స్ ఇవే.
పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటే.. ఆస్తిలో వాటా ఆడగొచ్చా?
పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటే.. ఆస్తిలో వాటా ఆడగొచ్చా?
ఎడారి దేశంలో ఈ మొక్క బంగారు గని.. మన దేశంలో పెంచే ప్రయత్నం..
ఎడారి దేశంలో ఈ మొక్క బంగారు గని.. మన దేశంలో పెంచే ప్రయత్నం..
మీరు గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు..అయితే ఇలా చేయండి!
మీరు గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు..అయితే ఇలా చేయండి!
అల్లు అర్జున్ బన్నీ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
అల్లు అర్జున్ బన్నీ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
మహిళ శరీరం నుంచి పంది కిడ్నీ తొలగింపు! కారణం..?
మహిళ శరీరం నుంచి పంది కిడ్నీ తొలగింపు! కారణం..?
మెడిమిక్స్‌ సోప్‌ తొలినాళ్లలో ఎందుకు తయారు చేశారో తెలుసా..?
మెడిమిక్స్‌ సోప్‌ తొలినాళ్లలో ఎందుకు తయారు చేశారో తెలుసా..?
వచ్చే మూడు రోజలు ఏపీకి రెయిన్ అలర్ట్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
వచ్చే మూడు రోజలు ఏపీకి రెయిన్ అలర్ట్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
పవర్‌ఫుల్‌ టూ గ్లామర్.. 2 వారాల్లో రెండు వేరియేషన్స్‌‎లో తమన్నా..
పవర్‌ఫుల్‌ టూ గ్లామర్.. 2 వారాల్లో రెండు వేరియేషన్స్‌‎లో తమన్నా..
మొదటి ఫోటో షూట్‌లో అలా.. ఇప్పుడేమో ఇలా..!!
మొదటి ఫోటో షూట్‌లో అలా.. ఇప్పుడేమో ఇలా..!!