Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Airport: ముంబై ఎయిర్‌పోర్ట్ అరుదైన రికార్డు.. కోవిడ్ పాండమిక్ తర్వాత తొలిసారి..

Mumbai Airport: ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సింగిల్ రన్‌వే విమానాశ్రయాలలో ఒకటైన ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (CSMIA)..

Mumbai Airport: ముంబై ఎయిర్‌పోర్ట్ అరుదైన రికార్డు.. కోవిడ్ పాండమిక్ తర్వాత తొలిసారి..
Mumbai International Airpor
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 20, 2022 | 12:50 PM

Mumbai Airport: ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సింగిల్ రన్‌వే విమానాశ్రయాలలో ఒకటైన ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (CSMIA) తన సింగిల్-డే రికార్డును బద్దలు కొట్టింది. 17 సెప్టెంబర్ 2022న అత్యధిక ప్రయాణికులు ఈ ఎయిర్‌పోర్టు ద్వారా ప్రయాణం సాగించారు. దాదాపు 1,30,378 మంది ప్రయాణించారు. కోవిడ్ పాండమిక్ తర్వాత అంటే దాదాపు రెండేళ్ల తరువాత ఇదే అత్యధికం. సెప్టెంబర్ 17న మొత్తం 839 విమాన సర్వీసులు నడవగా.. టెర్మినల్ 2 ద్వారా 95,080 మంది, టెర్మినల్1 ద్వారా 35,294 మంది ప్రయాణనించారు.

ఇండిగో, విస్తారా, గో ఫస్ట్ దేశీయ మార్గాల్లో అత్యధిక ప్రయాణీకులు ప్రయాణించారు. అంతర్జాతీయ విషయానికొస్తే.. ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎమిరేట్స్ మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలు దేశీయంగా మొదటి 3 గమ్యస్థానాలను కలిగి ఉండగా.. దుబాయ్, అబుదాబి, సింగపూర్ అత్యధిక విమాన ట్రాఫిక్‌తో మొదటి 3 అంతర్జాతీయ రూట్‌లుగా నిలిచాయి.

ట్రాఫిక్ పెరుగుదల.. కొత్త గమ్యస్థానాలకు, పెరుగుతున్న విమానాల రాకపోకలకు, ఎయిర్‌పోర్టులో ఎయిర్‌లైన్ సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది అని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం పేర్కొంది. మరుసటిరోజు అంటే సెప్టెంబర్ 18(ఆదివారం) కూడా అంతేస్థాయిలో ప్రయాణికుల రద్దీ ఉంది. సుమారు 1.3 లక్షల మంది ప్రయాణికులు.. ముంబై ఎయిర్‌పోర్టు ద్వారా ప్రయాణించారు. వీరిలో 98 వేలకు పైగా ప్రయాణికులు దేశీయ ప్రయాణం చేయగా.. 32 వేలకు పైచిలుకు ప్రయాణికులు అంతర్జాతీయ ప్రయాణాలు సాగించారు.

ఇవి కూడా చదవండి

ఇక రేటింగ్ ఏజెన్సీ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ICRA) ప్రకారం.. ఆగస్టు 2022లో దేశీయ ట్రాఫిక్ 5 శాతం పెరిగి 1.02 కోట్లకు చేరుకుంది. విమాన కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోవడంతో విమానయాన పరిశ్రమ పునరుద్ధరణకు దారితీసిందని పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..