Police: మరో రెండు నెలల్లో రిటైర్ అవ్వబోతున్న పోలీస్..తన 36 ఏళ్ల సర్వీసులో
మరో రెండు నెలల్లో పదవీ విరమణ చేయబోతున్న ఓ ఎస్సై అందరిచేత షభాష్ అనిపించుకుంటున్నారు. ముంబయికి చెందిన బాబూరావు కృష్ణకాంబే అనే పోలీస్ అధికారి.. తన 36 ఏళ్ల సర్వీసులో 165 మిస్సింగ్ కేసులు ఛేదించి మన్ననలు అందుకుంటున్నారు.

మరో రెండు నెలల్లో పదవీ విరమణ చేయబోతున్న ఓ ఎస్సై అందరిచేత షభాష్ అనిపించుకుంటున్నారు. ముంబయికి చెందిన బాబూరావు కృష్ణకాంబే అనే పోలీస్ అధికారి.. తన 36 ఏళ్ల సర్వీసులో 165 మిస్సింగ్ కేసులు ఛేదించి మన్ననలు అందుకుంటున్నారు. ఇటీవల 16 ఏళ్ల కుమార్తె కనిపించడం లేదని ఓ తండ్రి ఫిర్యాదు చేశాడు. అయితే బాబూరావు వారం రోజుల్లోనే ఆ కేసు దర్యాప్తు పూర్తి చేశారు. తప్పిపోయిన బాలిక మొబైల్ ఫోను కూడా వాడకపోవడంతో, ఆమె ఎక్కడుందో కనిపెట్టడం బాబురావుకి కష్టంగా మారింది.అయినా కూడా వెనక్కి తగ్గకుండా బాలిక బంధువులు, స్నేహితుల నుంచి సమాచారం సేకరించారు. చివరికి ఆమెకు గుజరాత్‌లోని ఓ యువకుడితో స్నేహం ఉండటంతో తల్లిదండ్రులను వదిలిపెట్టి సూరత్‌లోని దూరపు బంధువుల ఇంటికి వెళ్లినట్లు గుర్తించారు.
అయితే అధికారుల ఆదేశాల మేరకు అక్కడికి వెళ్లిన బాబురావు బాలికను తీసుకొచ్చారు. ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులకు అప్పగించారు. ఇలా ఒకటీ, రెండు కాదు.. తన 36 ఏళ్ల సర్వీసులో 165 కేసులు ఛేదించారు. ముంబయిలోని మాతుంగ పోలీస్‌స్టేషనులో విధులు నిర్వహిస్తున్న ఆయనకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. దేశంలో ఏ ప్రాంతానికి చెందినవారైనా సరే తప్పిపోయిన పిల్లలను తిరిగి వాళ్ల తల్లిదండ్రుల వద్దకు చేర్చడంలో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..



