AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరాభవం జరిగిన చోటే సత్కారం అందుకున్న కానిస్టేబుల్‌

ముంబాయిలోని ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ గాంధీ మార్గాన్ని అనుసరించారు.. ఓర్పు సహనం పాటించారు.. ఉన్నతాధికారులతో సత్కారాన్ని పొందారు.. ఆయనకు ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే సన్మానం అందుకున్నారు..

పరాభవం జరిగిన చోటే సత్కారం అందుకున్న కానిస్టేబుల్‌
Balu
|

Updated on: Oct 30, 2020 | 11:09 AM

Share

ముంబాయిలోని ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ గాంధీ మార్గాన్ని అనుసరించారు.. ఓర్పు సహనం పాటించారు.. ఉన్నతాధికారులతో సత్కారాన్ని పొందారు.. ఆయనకు ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే సన్మానం అందుకున్నారు.. దక్షిణ ముంబాయిలోని కల్బాదేవి అనే ఏరియాలో ఏక్‌నాథ్‌ పార్థే అనే ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ విధులు నిర్వర్తిస్తున్నారు.. అప్పుడే ఓ టూ వీలర్‌పై మహిళ రయ్యిమంటూ దూసుకొచ్చింది.. హెల్మెట్‌ పెట్టుకోకుండా ప్రయాణిస్తున్నందుకు ఆమెను ఆపారు ఏక్‌నాథ్‌ పార్థే.. ఆ మాత్రందానికే ఆ మహిళకు ఆగ్రహం వచ్చేసింది.. తనను పార్థే తిట్టాడంటూ అభాండాలు వేసి చొక్కా పట్టుకుని కొట్టింది.. ఆమె దుందుడుకు చర్య దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.. అయితే ఆ మహిళ కొడుతున్నంత సేపూ ఏక్‌నాథ్‌ పార్థే సహనం కోల్పోలేదు.. సంయమనం పాటిస్తూ అలా నిలబడ్డారు.. ఇది జరిగిన తర్వాత ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేశారు.. మహిళతో పాటు మరో వ్యక్తిని కూడా అరెస్ట్‌ చేశారు.. ఎక్కడైతే ఏక్‌నాథ్‌ పార్థేను మహిళ కొట్టిందో అక్కడే ఆయనకు మహారాష్ట్ర పోలీసులు సన్మానం చేశారు..

Follow Us