Drugs Found in Mumbai: ముంబై గొడౌన్ లో రూ.120 కోట్ల విలువ చేసే డ్రగ్స్ లభ్యం.. ఎయిర్ ఇండియా మాజీ పైలట్ సహా ఇద్దరి అరెస్ట్
గత కొన్ని నెలలుగా.. ముంబైలోని వివిధ ప్రాంతాల నుండి పోలీసు బృందాలు భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంటూనే ఉన్నాయి. ఎక్కడెక్కడ నుంచి డ్రగ్స్‌తీసుకొస్తున్నారనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. ఓ గోడౌన్ నుంచి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు 50 కిలోల మెఫెడ్రోన్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఎయిరిండియా మాజీ పైలట్‌తో సహా ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులిద్దరూ ముంబై వాసులుగా గుర్తించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో డ్రగ్స్ ధర 120 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితులిద్దరినీ ఎన్‌సీబీ బృందం విచారిస్తోంది. ఎక్కడెక్కడ నుంచి డ్రగ్స్‌తీసుకొస్తున్నారనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. గత కొన్ని నెలలుగా.. ముంబైలోని వివిధ ప్రాంతాల నుండి పోలీసు బృందాలు భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంటూనే ఉన్నాయి.
గురువారం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ .. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో 16 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. అదే సమయంలో ఓ వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. హెరాయిన్ ఖరీదు దాదాపు రూ.80 కోట్లు ఉంటుందని అంచనా. డీఆర్‌ఐ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. హెరాయిన్‌ను ట్రాలీ బ్యాగ్‌లో దాచి తెస్తున్నట్లు గుర్తించారు.
NCB ने मुंबई स्थित एक गोदाम में छुपाए गए लगभग 50 किलो MD ड्रग बरामद किया। यह एक कार्टेल द्वारा चलाया जा रहा था। हमने कार्टेल के सरगना समेत 2 लोगों को गिरफ़्तार किया है। हमने पहले भी इस कार्टेल के सरगना को मैंड्रेक्स ड्रग की तस्करी में गिरफ़्तार किया था: NCB उप महानिदेशक एसके सिंह pic.twitter.com/B9ZTk6YaO9
— ANI_HindiNews (@AHindinews) October 7, 2022
700 కిలోల డ్రగ్స్ స్వాధీనం: ఆగస్టులో ముంబై క్రైమ్ బ్రాంచ్‌లోని యాంటీ నార్కోటిక్స్ సెల్ భారీ డ్రగ్ రాకెట్‌ను ఛేదించింది. నలసోపరాలోని ఫార్మాస్యూటికల్ తయారీ యూనిట్‌పై దాడి చేసి రూ.1,400 కోట్ల విలువైన 700 కిలోలకు పైగా మెఫెడ్రోన్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఐదుగురిని అరెస్టు చేశారు. డ్రగ్‌ను కంటైనర్‌లో ఉంచి ఢిల్లీకి తరలిస్తుండగా డ్రగ్స్ ను గుర్తించారు.
న్హావ శేవ పోర్టులో 20 టన్నుల హెరాయిన్ స్వాధీనం సెప్టెంబరులో.. ముంబైలోని ముంబైలోని న్హావ శేవ నౌకాశ్రయం నుండి పోలీసులు 20 టన్నుల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని ధర దాదాపు రూ.1725 కోట్లుగా పేర్కొంది. ఇటీవల ముంబై విమానాశ్రయంలో 5 కిలోల హెరాయిన్ పట్టుబడింది. ఓ విదేశీ పౌరుడిని కూడా అరెస్టు చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని ధర 30 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..