మనుషులపై దాడి చేసే ‘మ్యాన్ ఈటర్ ‘ చివరకు పట్టుబడింది….కాశ్మీర్ వాసుల్లో తొలగిన భయం
కాశ్మీర్ లోని బడ్గామ్ జిల్లాలో మనిషి రక్తం రుచి మరిగిన చిరుత పులి ఎట్టకేలకు పట్టుబడింది. ఈ జిల్లాలో తన ఇంటివద్ద ఆడుకుంటున్న 4 ఏళ్ళ బాలికపై దాడి చేసి ఆ చిన్నారిని ఎత్తుకుపోయిన ఈ చిరుతను పట్టుకునేందుకు స్థానికులు, వన్యమృగ సంరక్షణ...
కాశ్మీర్ లోని బడ్గామ్ జిల్లాలో మనిషి రక్తం రుచి మరిగిన చిరుత పులి ఎట్టకేలకు పట్టుబడింది. ఈ జిల్లాలో తన ఇంటివద్ద ఆడుకుంటున్న 4 ఏళ్ళ బాలికపై దాడి చేసి ఆ చిన్నారిని ఎత్తుకుపోయిన ఈ చిరుతను పట్టుకునేందుకు స్థానికులు, వన్యమృగ సంరక్షణ కేంద్ర అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కనబడకుండా పోయిన బాలిక మృత దేహం ఓంపోరా అనే ఏరియాలోని ఓనర్సరీ సమీపంలో ఛిద్రమై కనిపించింది. ఈ చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది కూడా వచ్చి కాశ్మీర్ అంతటా గాలించారు. జనావాసాల్లో ఇలాంటి క్రూర మృగాలు ప్రవేశిస్తాయని ఊహించని వారు ముఖ్యంగా అడవుల్లో విస్తృతంగా మాటు వేసి మరీ గాలించినా ఫలితం లేకపోయింది. సుమారు 11 రోజులుగా వారు చేసిన నిర్విరామ యత్నాలు ఫలించాయి.. స్థానికుడొకరు ఇచ్చిన సమాచారం మేరకు మళ్ళీ ఇదే బడ్గామ్ జిల్లాలో డీసీ కార్యాలయం వద్ద అది కనిపించగానే ట్రాంక్విలైజర్ ప్రయోగించి దాన్ని పట్టుకున్నారు.
దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇన్ని నెలలుగా తమను భయాందోళనకు గురి చేసిన చిరుతను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు బోను వద్దకు చేరుకున్నారు. కాగా ఇప్పటివరకు ఐదు చిరుత పులులను అటవీ అధికారులు పట్టుకున్నారు.కాశ్మీర్ లోని బడ్గామ్ జిల్లాతో బాటు షోపియాన్ తదితర జిల్లాల్లో చిరుతల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇవి జనావాసాల్లో ప్రవేశించి వారు పెంచుకుంటున్న పశువులు, ఇతర పెంపుడు జంతువుల ,మీద దాడి చేస్తుంటాయి. తాజాగా ఈ చిరుత పట్టుబడడంతో స్థానికుల సంతోషానికి అంతులేకపోయింది.
మరిన్ని ఇక్కడ చూడండి: రైళ్లో సీటు కోసం ఏకంగా యువకుడు చేసిన తతంగం నవ్వులు పూయిస్తున్న వీడియో : Viral Video.
Rare Photos and videos: ఒకే ఫేమ్ లో టాలీవుడ్ లెజెండరీ హీరోలు.. 33 ఏళ్ళక్రితం ఫోటో వైరల్ వీడియో.
Dog Viral Video : చెట్టు కొట్టకుండా అడ్డుపడిన కుక్క..ఎందుకంటే!వైరల్ అవుతున్న వీడియో.
యంగ్ హీరో నిఖిల్ ఖాతాలో మరో మూడు సినిమాలు.?బిజీ బిజీ గా యంగ్ హీరో :Nikhil Siddharth Video.