మహారాష్ట్ర ఎమ్మెల్సీ నామినేషన్ల వివాదం.. గవర్నర్ చర్యను సమర్థించిన బాంబేహైకోర్టు
మహారాష్ట్రలో ఎమ్మెల్సీ నామినేషన్ల వివాదం ఇంకా కొనసాగుతోంది. గవర్నర్ కోటాలో ఎగువ సభకు (విధాన పరిషద్) 12 మంది పేర్లను సిఫారసు చేస్తూ లోగడ శివసేన ప్రభుత్వం పంపిన పేర్లపై గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ ఇంకా నిర్ణయం తీసుకోని వైనం ఆయనకు.ప్రభుత్వానికి. మధ్య విభేదాలను చూపుతోంది.
మహారాష్ట్రలో ఎమ్మెల్సీ నామినేషన్ల వివాదం ఇంకా కొనసాగుతోంది. గవర్నర్ కోటాలో ఎగువ సభకు (విధాన పరిషద్) 12 మంది పేర్లను సిఫారసు చేస్తూ లోగడ శివసేన ప్రభుత్వం పంపిన పేర్లపై గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ ఇంకా నిర్ణయం తీసుకోని వైనం ఆయనకు-.ప్రభుత్వానికి. మధ్య విభేదాలను చూపుతోంది. గత ఏడాది నవంబరులో ఈ పేర్లను పరిశీలించవలసిందిగా ప్రభుత్వం పంపినా… గవర్నర్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, చాలా జాప్యం జరిగిందని అంటూ నాసిక్ కి చెందిన రతన్ సోలి లూత్ అనే వ్యక్తి బాంబేహైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఆయనను ఆదేశించాలని కోరారు. ఎనిమిది నెలలు గడిచిపోయాయన్నారు.అయితే ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు..ఇది సరైన సమయమేనని, ఇంకా ఎక్కువ జాప్యం జరగకుండా గవర్నర్ తన రాజ్యాంగ బద్డ విధిని నిర్వర్తించారని పేర్కొంది. కాగా ఈ గవర్నర్ కావాలనే ఈ జాబితాను పరిశీలించకుండా తొక్కి పెట్టారని, నిర్ణయం తీసుకోకుండా జాప్యన్ చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరఫు లాయర్ కోర్టులో ఆరోపించారు. కానీ కోర్టు ..ఇందులో అనౌచిత్యమేమీ లేదని భావించింది. ఈ పరిణామాల నేపథ్యంలో భగత్ సింగ్ కొష్యారీ..ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాతో శనివారం భేటీ అయ్యారు.
ఇది మర్యాదపూర్వకంగా జరిగిన భేటీయేనని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. ఏమైనప్పటికీ ..ఇంతకాలంగా ఆయన ఈ నామినేషన్ల వివాదాన్ని కొనసాగిస్తున్నారని మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ఇలా జాప్యం చేయడం ఒక గవర్నర్ కు తగదని అంటోంది. లోగడ కోవిడ్ ఆంక్షల సడలింపు సమయంలో ఆలయాలను మళ్ళీ తెరవాలని, ఇందుకు అనుమతించాలని కొష్యారీ కోరడం, సీఎం ఉద్ధవ్ థాక్రే వెంటనే అంగీకరించకపోవడం తెలిసిందే. అప్పటి నుంచి ఇద్దరి మధ్యా విభేదాలు పెరిగిపోయాయి. .
మరిన్ని ఇక్కడ చూడండి: మహాత్మా గాంధీకి అమెరికా అత్యున్నత ‘స్వర్ణ’ పురస్కారం..? ప్రతినిధుల సభలో ఎంపీ తీర్మానం
Telangana: 57 ఏళ్లు నిండిన వారికి అలెర్ట్.. నెలాఖరు వరకు వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ