Independence Day: మనతో పాటు..ఆగస్టు 15నాడే స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న దేశాలు ఏమున్నాయో తెలుసా..

ఆగస్టు 15.. భారతదేశం స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న రోజు.. తెల్లవాడిపై పోరాటంలో స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలకు ప్రతిఫలం దక్కిన మధురమైన రోజు.

Independence Day: మనతో పాటు..ఆగస్టు 15నాడే స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న దేశాలు ఏమున్నాయో తెలుసా..
India Independence Day
Follow us
Sanjay Kasula

| Edited By: Anil kumar poka

Updated on: Aug 02, 2022 | 7:13 PM

1947లో బ్రిటీష్‌ పాలకుల నుంచి స్వాతంత్ర్యం పొందిన నాటి నుంచి ఏటా ఆగస్టు 15న భారతీయులమంతా గర్వంగా.. ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. మనం సరే.. ఇదే రోజున మనతోపాటు మరికొన్ని దేశాలు కూడా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయని మీకు తెలుసా..

Bahrain Independence Day

Bahrain Independence Day: బహ్రెయిన్‌కు ఎంతో చరిత్ర ఉంది. వందకుపైగా ఐలాండ్స్‌.. ఇసుక దిబ్బలు కలిగి ఉన్న ఈ ప్రాంతాన్ని అనేక మంది చక్రవర్తులు పరిపాలిస్తూ వచ్చారు. అయితే బ్రిటిష్‌తో చేసుకున్న ఒప్పందాలతో బహ్రెయిన్‌పై తెల్లదొరల పరిపాలన సాగేది. అయితే 1971 ఆగస్టు 15న ఐక్యరాజ్యసమితి బహ్రెయిన్‌ స్వతంత్ర దేశంగా ఉండటంపై రెఫరెండం నిర్వహించింది. ఫలితంగా బహ్రెయిన్‌ అధికారికంగా స్వతంత్ర దేశంగా ఏర్పడింది.

Republic Of Congo Independe

Republic Of Congo Independe: 1880లో ఉత్తర కాంగోప్రాంత నది పరివాహక ప్రాంతాలను ఫ్రాన్స్‌ ఆక్రమించి ఫ్రెంచ్‌ కాలనీలుగా ఏర్పర్చుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా మధ్య కాంగో సహా అనేక ప్రాంతాలను స్వాధీన పర్చుకొని ఫ్రెంచ్‌ కాలనీలుగా మార్చింది. 1908లో తన అధీనంలో ఉన్న ప్రాంతాన్ని ఫ్రెంచ్‌ ఈక్వటోరియల్‌ ఆఫ్రికాగా నామకరణం చేసింది. కాంగో ‘రిపబ్లిక్‌ ఆఫ్‌ ది కాంగో’గా ఏర్పడింది. అయితే ఆ తర్వాత ఫ్రాన్స్‌ సైన్యంపై రిపబ్లిక్‌ ఆఫ్‌ ది కాంగో తిరుగుబాటు చేసి 1960 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సంపాదించుకుంది.

South Korea Independence Da South Korea Independence: జపాన్‌ పాలనలో నలిగిపోయిన ఉమ్మడి కొరియా దేశం 1945లో ఇదే రోజున స్వాతంత్ర్యం పొందింది. 1910 నుంచి ఉమ్మడి కొరియాపై జపాన్‌ అధికారం చలాయించింది. అయితే రెండో ప్రపంచయుద్దం సమయంలోనే అమెరికా, సోవియేట్‌ ఆర్మీలతో కలిసి జపాన్‌పై కొరియా పోరాడింది. రెండో ప్రపంచయుద్ధంలో జపాన్‌ సైన్యం ఓడిపోయింది. దీంతో 1945 ఆగస్టు 15న మిత్ర రాజ్యాలకు లొంగిపోతున్నట్లు అప్పటి జపాన్‌ చక్రవర్తి హిరోహిటో ప్రకటించారు. దీంతో కొరియాపై జపాన్‌ ఆధిపత్యం కూడా ముగిసింది. అదే రోజున కొరియా స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది.

North Korea Independence Da

North Korea Independence: అయితే  మూడేళ్ల తర్వాత అంటే 1948లో కొరియా రెండు దేశాలుగా విడిపోయింది. యూస్‌కి అనుకూలంగా దక్షిణ కొరియా.. సోవియేట్‌కు అనుకూలంగా ఉత్తర కొరియా ఏర్పడ్డాయి. అయినా ఇరు దేశాలు ఆగస్టు 15ను నేషనల్‌ లిబరేషన్‌ డేగా జరుపుకొంటున్నాయి.

PM Kisan Samman Nidhi: రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయా ? రాకపోతే ఇలా ఫిర్యాదు చేయండి..

Viral News: రూమ్ నుంచి వింత శబ్దాలు.. ఏంటని చూడగా షాక్.. అసలు మ్యాటర్ తెలిస్తే నవ్వులే నవ్వులు!