Viral News: రూమ్ నుంచి వింత శబ్దాలు.. ఏంటని చూడగా షాక్.. అసలు మ్యాటర్ తెలిస్తే నవ్వులే నవ్వులు!

మీ బెడ్‌రూమ్‌లో అకస్మాత్తుగా నాగుపాము బుసలు కొడుతున్నట్లుగా శబ్దం వినిపిస్తే.? ఇంకేమైనా ఉందా.! గుండె ఆగినంత పనవుతుంది..

Viral News: రూమ్ నుంచి వింత శబ్దాలు.. ఏంటని చూడగా షాక్.. అసలు మ్యాటర్ తెలిస్తే నవ్వులే నవ్వులు!
Bed Room
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 14, 2021 | 2:30 PM

మీ బెడ్‌రూమ్‌లో అకస్మాత్తుగా నాగుపాము బుసలు కొడుతున్నట్లుగా శబ్దం వినిపిస్తే.? ఇంకేమైనా ఉందా.! గుండె ఆగినంత పనవుతుంది. సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి సింగపూర్‌లో చోటు చేసుకుంది. ఓ మహిళ నిద్రిస్తున్న సమయంలో తన గదిలో నుంచి నాగుపాము బుసులు కొడుతున్నట్లుగా శబ్దం రావడం విన్నది. దీనితో ఒక్కసారిగా భయపడిన ఆమె వెంటనే రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించి రమ్మని కోరింది. వారంతా కూడా వచ్చి సెర్చ్ చేయగా.. దొరికిన వస్తువును చూసి గట్టి షాక్ తిన్నారు. అసలు ఇంతకీ ఆ కధేంటో చూసేద్దాం పదండి.!

Snake

సింగపూర్‌కు చెందిన ఓ మహిళ అర్ధరాత్రి వేళ తన బెడ్‌రూమ్ నుంచి నాగుపాము బుసులు కొడుతున్నట్లుగా వస్తోన్న శబ్దాన్ని విన్నది. తన గదిలోకి పాము దూరిందని అనుకుని భయపడి.. వెంటనే రెస్క్యూ టీంకు సమాచారాన్ని అందించింది. వారు కూడా అక్కడికి హుటాహుటిన చేరుకున్నారు. మొత్తం ఆ రూమ్‌ సెర్చ్ చేశారు.

కొద్దిసేపు సెర్చ్ ఆపరేషన్ అనంతరం.. ఆ రెస్క్యూ టీంకు పాము కనిపించకపోగా.. బెడ్‌రూమ్‌లో ఓ మూలన ఓరల్-బీ ఎలక్ట్రిక్ బ్రష్ కనిపించింది. దానిని ఆన్, ఆఫ్ చేయగా.. పాము బుసులు కొడుతున్నట్లుగా శబ్దాలు రావడం మొదలైంది. అప్పుడు గానీ అసలు మ్యాటర్ ఏంటన్నది ఆ మహిళకు అర్ధం కాలేదు. ఎలక్రిక్ట్ బ్రష్ బ్యాటరీ తడిసిపోవడం వల్ల ఇలాంటి వింత శబ్దాలు వస్తోందని గ్రహించింది. దీనితో ఆ మహిళ తన తప్పును తెలుసుకుని రెస్క్యూ టీంకు క్షమాపణలు చెప్పింది.

Also Read:

జింకను వేటాడేందుకు నక్కిన చిరుత.. చివరికి షాకింగ్ సీన్.. వీడియో చూస్తే షాకవుతారు!

చాణక్య నీతి: ఈ మూడు అలవాట్లు ఉంటే.. యువత జీవితం నాశనం అయినట్లే.. అవేంటంటే.!

 ఈ ఫోటోలో పులి దాగుంది.. మీరు గుర్తించగలరా.? ఈజీగా కనిపెట్టొచ్చు చూడండి.!