AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan Samman Nidhi: రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయా ? రాకపోతే ఇలా ఫిర్యాదు చేయండి..

సామాన్య ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. అందులో ముఖ్యంగా దేశంలోని రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు

PM Kisan Samman Nidhi: రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయా ? రాకపోతే ఇలా ఫిర్యాదు చేయండి..
Pm Kisan
Rajitha Chanti
|

Updated on: Aug 14, 2021 | 2:55 PM

Share

సామాన్య ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. అందులో ముఖ్యంగా దేశంలోని రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఎన్నో స్కీమ్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఒకటి. ఈ పథకం ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ అవుతోంది. ఎలాంటి లోసుగులు.. థర్డ్ పార్టీ హస్తం లేకుండా.. అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ ప్రవేశపెట్టింది. దీని ద్వారా రైతులకు సంవత్సరానికి రూ. 6000 నగదు వారి అకౌంట్స్‏లో జమకానున్నాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా..ఒక్కో విడతలో రూ. 2000 చొప్పున అన్నదాతలు పొందుతున్నారు. ఇప్పటివరకు 8 విడతల వారిగా నగదు వారి ఖాతాల్లోకి జమ అయ్యింది. తాజాగా 9వ విడత నగదును ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం  రూ. 9.75 కోట్లకు పైగా లబ్ధిదారులైన రైతు కుటుంబాలు ఆర్థిక ప్రయోజనాన్ని పొందాయి. అందులో మీ ఖాతాల్లోకి నగదు జమ అయ్యిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల జాబితాను చెక్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందామా.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి హెల్ప్ లైన్ నెంబర్లు.. * రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వాయిదా మొత్తాన్ని అందుకోకపోతే లేదా ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నంబర్లలో ఫిర్యాదు చేయవచ్చు. * పీఎం కిసాన్ సమ్మాన్ నిధి హెల్ప్ లైన్ నంబర్లు.. 155261, 011-24300606, 011-23381092 * అలా కాకుండా.. రైతులు తమ ఫిర్యాదులను https://pmkisan.gov.in/Grievance.aspx లో నమోదు చేయవచ్చు. * వీరి ఫిర్యాదును ఆధార్ నంబర్, ఖాతా సంఖ్య, మొబైల్ నంబర్ ద్వారా కూడా నమోదు చేయవచ్చు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుని స్థితి (Beneficiary Status) చెక్ చేసుకోవడం.. * పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారు స్థితిని తెలుసుకొవడానికి https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx కి లాగిన్ కావాలి. * అలా కాకుండా.. ఆధార్ నంబర్, ఖాతా నంబర్, మొబైల్ నంబర్ ద్వారా పీఎం కిసాన్ లబ్ధిదారు స్థితిని చెక్ చేసుకోవచ్చు.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల జాబితా లింక్ ఎలా చెక్ చేసుకోవాలి… * పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల జాబితాను చెక్ చేయడానికి https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx కి లాగిన్ కావాలి. * అందులో మీ రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాలను ఎంటర్ చేయాలి. * చివరగా.. గెట్ రిపోర్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Also Read: SBI Alert: కస్టమర్లకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్.. గృహ రుణాలపై కీలక ప్రకటన.. ఏంటంటే.?

Electric Scooter: స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంఛ్.. ప్రీ బుకింగ్ ఎలా అంటే