మహాత్మా గాంధీకి అమెరికా అత్యున్నత ‘స్వర్ణ’ పురస్కారం..? ప్రతినిధుల సభలో ఎంపీ తీర్మానం

శాంతి, అహింసావాదానికి విశేషమైన కృషి చేసినందుకు గాను జాతిపిత మహాత్మా గాంధీకి అమెరికా కాంగ్రెస్ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించాలని కోరుతూ ఓ ఎంపీ ప్రతినిధుల సభలో తన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

మహాత్మా గాంధీకి అమెరికా అత్యున్నత 'స్వర్ణ' పురస్కారం..? ప్రతినిధుల సభలో ఎంపీ తీర్మానం
Gold Medal To Mahatma Gandhi
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Aug 14, 2021 | 2:07 PM

శాంతి, అహింసావాదానికి విశేషమైన కృషి చేసినందుకు గాను జాతిపిత మహాత్మా గాంధీకి అమెరికా కాంగ్రెస్ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించాలని కోరుతూ ఓ ఎంపీ ప్రతినిధుల సభలో తన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అహింసాయుతంగా ఓ ఉద్యమానికి ఊపిరిలూది..దేశానికి స్ఫూర్తిమంతంగా నిలిచిన మహాత్మా గాంధీ ఈ అవార్డుకు పూర్తిగా అర్హులని, ఆయన నిర్వహించిన సత్యాగ్రహం మొత్తం ప్రపంచంపైనే చక్కని ప్రభావం చూపిందని కెరొలిన్ బి.మెలోనీ అనే ఈ ఎంపీ తన తీర్మానంలో పేర్కొన్నారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, నెల్సన్ మండేలా, మదర్ థెరెసా వంటి ప్రముఖులను ఈ ఎంపీ ప్రస్తావించారు. ఇతరులకు సేవ చేయడంలోనే మన జీవితాలను అంకితం చేయాలన్న లక్ష్యానికి గాంధీజీ ఉదాహరణగా నిలుస్తారని, ఆయన చూపిన సాహసం, తెగువ ప్రతి రోజూ తనకు స్ఫూర్తినిస్తాయని ఆమె అన్నారు. అమెరికాలో అత్యున్నత పురస్కారమైన ఈ గోల్డ్ మెడల్ ని గాంధీజీకి ప్రభుత్వం ప్రకటించిన పక్షంలో ఈ మరణానంతర అవార్డును పొందిన తొలి భారతీయుడు ఆయనే అవుతారు.

జాతి వివక్షను అంతమొందించేందుకు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, నెల్సన్ మండేలా చేసిన ప్రచారోద్యమాలను కెరొలిన్ గుర్తు చేశారు.అలాగే జార్జి వాషింగ్టన్..మదర్ థెరెసా … వంటి ప్రముఖులు మానవ సేవే మాధవ సేవ అన్న నానుడికి చిహ్నంగా నిలిచారన్నారు. ఈ ఎంపీ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా ప్రతినిధుల సభ పరిశీలించనుంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Telangana: 57 ఏళ్లు నిండిన వారికి అలెర్ట్.. నెలాఖరు వరకు వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ

NASA: అది తగిలితే.. అంతా తుడిచిపెట్టుకుపోతుంది.. భూమిని ఢీ కొట్టనున్న భారీ గ్రహశకలం..