Crime News: స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లలో అపశృతి.. ముగ్గురు మునిసిపల్ ఉద్యోగుల దుర్మరణం..

3 Killed As Trolley Of Crane Breaks: స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లల్లో అపశృతి చోటుచేసుకుంది. ఓ పోస్ట్ ఆఫీస్ భవనంపై జాతీయజెండాను ఏర్పాటు చేస్తుండగా క్రేన్ విరిగిపడి..

Crime News: స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లలో అపశృతి.. ముగ్గురు మునిసిపల్ ఉద్యోగుల దుర్మరణం..
3 Killed As Trolley Of Crane Breaks
Follow us

|

Updated on: Aug 14, 2021 | 1:57 PM

3 Killed As Trolley Of Crane Breaks: స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లల్లో అపశృతి చోటుచేసుకుంది. ఓ పోస్ట్ ఆఫీస్ భవనంపై జాతీయజెండాను ఏర్పాటు చేస్తుండగా క్రేన్ విరిగిపడి.. ముగ్గురు మునిసిపల్ ఉద్యోగులు దుర్మరణం చెందారు. ఈ విషాద సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నగరంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. గ్వాలియర్ నగర కార్పొరేషన్‌కు చెందిన ముగ్గురు ఉద్యోగులు.. హైడ్రాలిక్ ఫైర్ బ్రిగేడ్ ట్రాలీలో కూర్చుని పోస్ట్ ఆఫీస్ భవనంపై జెండాలను ఏర్పాటుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో క్రేన్ ప్లాట్ ఫాం విరిగిపడింది. దీంతో ముగ్గురు ఉద్యోగులు కిందపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనలో క్రేన్ నడుపుతున్న డ్రైవరు కూడా తీవ్రంగా గాయపడినట్లు మున్సిపల్, పోలీసు అధికారులు తెలిపారు. చారిత్రాత్మక కట్టడాలకు ముస్తాబు చేస్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నారు.

కాగా.. మునిసిపల్ కార్మికుల మృతిపై మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్‌లో విచారం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు సీఎం చౌహాన్ ఇలా ట్విట్ చేశారు. గ్వాలియర్‌లోని మహారాజ్ బడా పోస్ట్ ఆఫీస్ వద్ద క్రేన్‌తో జాతీయ జెండా ఏర్పాటు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు ఉద్యోగులు మరణించడం మరో ముగ్గురు గాయపడినట్లు తెలిసింది. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్ చేశారు.

ఇదిలాఉంటే.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా.. ఘటనతో గ్వాలియర్ మున్సిపల్ కార్పోరేషన్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Also Read:

Afghanistan Taliban: చేతికందినది నోటి కందకుండా పోతోంది.. తాలిబన్ల రాకతో ఆఫ్ఘాన్‌ మహిళలకు మళ్లీ చీకటి జీవితాలు

గంజాయి మత్తులో బస్టాండ్‌లో యువకుడి వీరంగం.. పరుగులు పెట్టిన జనం.. చివరకు.. షాకింగ్ వీడియో..