4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య.. చిన్న క్లూ కూడా లేదు.. రంగంలోకి 700 మంది పోలీసులు.. ఫైనల్‌గా

4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, చంపిన క్రూరుడు.. నిందితుడ్ని ట్రాక్ చేసేందుకు అతడి వద్ద సెల్‌ఫోన్ కూడా లేదు. స్పాట్‌లో చిన్న క్లూ..

4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య.. చిన్న క్లూ కూడా లేదు.. రంగంలోకి 700 మంది పోలీసులు.. ఫైనల్‌గా
700 Policeman
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 14, 2021 | 3:05 PM

4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, చంపిన క్రూరుడు.. నిందితుడ్ని ట్రాక్ చేసేందుకు అతడి వద్ద సెల్‌ఫోన్ కూడా లేదు. స్పాట్‌లో చిన్న క్లూ కూడా లేదు. మరోవైపు నిందితుడ్ని అరెస్ట్ చేయాలని గ్రామాస్థుల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి. దీంతో పోలీసు ఉన్నతాధికారులు 700 మంది సిబ్బందిని రంగంలోకి దించి.. 24 గంటల లోపలే  ఆ కామాంధుడిని సెల్ లోపల పడేశారు. వివ‌రాల్లోకి వెళితే.. రాజ‌స్థాన్‌లోని జైపూర్ రూర‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఓ గ్రామంలో సురేష్ కుమార్ (25) అనే వ్య‌క్తి దారిలో వెళ్తూ ఇంటి బ‌య‌ట ఆడుకుంటున్న 4 ఏళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లాడు. అక్క‌డికి 5-7 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న చెరువు వ‌ద్ద ఆ బాలిక‌పై లైంగికదాడి చేసి అనంత‌రం ఆమెను హ‌త్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఈ క్ర‌మంలో ఆ గ్రామ‌స్తులు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టారు. నిందితున్ని వెంట‌నే ప‌ట్టుకోవాల‌ని డిమాండ్ చేశారు. దీంతో జైపూర్ రూర‌ల్ పోలీస్ సూప‌రింటెండెంట్ శంక‌ర్ ద‌త్ శ‌ర్మ ఆధ్వ‌ర్యంలో 700 మంది పోలీసులు రంగంలోకి దిగారు. స‌ద‌రు నిందితున్ని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.

అయితే నిందితుడు సురేష్ కుమార్ వద్ద ఫోన్ లేదు. దీంతో అత‌న్ని పట్టుకోవడం ఒక ద‌శ‌లో క‌ష్ట‌త‌రంగా మారింది. ఎందుకంటే నిందితుడు ఒక చోట నుంచి మరో చోటికి మూవ్ అవుతున్నాడు. దీంతో ఎక్కడ గాలింపు జరిపినా ఆచూకీ లభ్యం కావడం లేదు. అయిన‌ప్ప‌టికీ స్థానికంగా ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా అత‌ని క‌ద‌లిక‌ల‌పై ఫోకస్ పెట్టారు. దీంతో 24 గంట‌ల్లోనే నిందితున్ని ప‌ట్టుకుని రిమాండ్‌కు త‌ర‌లించారు. కాగా నాలుగేళ్ల బాలికపై అనాగరికంగా వ్యవహరించిన అత‌న్ని క‌ఠినంగా శిక్షించాల‌ని స్థానికులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

Also Read: Telangana: 57 ఏళ్లు నిండిన వారికి అలెర్ట్.. నెలాఖరు వరకు వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ

 చెవిటికల్లు వద్ద హైటెన్షన్.. వరదలో వందలాది లారీలు.. అనుకోకుండా

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?