Krishna District: చెవిటికల్లు వద్ద హైటెన్షన్.. వరదలో వందలాది లారీలు.. అనుకోకుండా

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద కృష్ణా నదిలో ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది. నదిలో ఇసుక కోసం వెళ్లిన వందకుపైగా...

Krishna District:  చెవిటికల్లు వద్ద హైటెన్షన్.. వరదలో వందలాది లారీలు.. అనుకోకుండా
Lorries Trapped In Flood
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 14, 2021 | 1:28 PM

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద కృష్ణా నదిలో ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది. నదిలో ఇసుక కోసం వెళ్లిన వందకుపైగా లారీలు వరదలో చిక్కుకున్నాయి. అకస్మాత్తు వరదతో రోడ్డు కూడా కొంతమేర దెబ్బతింది. లారీలన్నీ తిరిగి వెనక్కి రాలేని పరిస్థితి ఏర్పడింది. దాదాపు 132 లారీలు వరదలో చిక్కుకుపోయినట్లు సమాచారం అందుతోంది. ఇన్ఫర్మేషన్ అందిన వెంటనే పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రొక్లెయిన్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు, కూలీలను.. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు పడవల్లో ఒడ్డుకు చేర్చారు. వరద తగ్గితే తప్ప ఈ లారీలను బయటకు తీసుకురాలేమని అధికారులు చెబుతున్నారు. శనివారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో మున్నేరుకు ఒక్కసారిగా వరద రావడం, లారీలు వెనక్కి తిరిగి వచ్చే రోడ్డు మార్గం లేకపోవడంతో లారీలు అన్నీ వరద నీటిలో చిక్కుకున్నాయి. నాటు పడవల ద్వారా ఎటువంటి ప్రాణ నష్టం లేకండా అందర్నీ ఒడ్డకు చేర్చడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ప్రస్తుతం కృష్ణానదికి పులిచింతల డ్యామ్‌ నుంచి 75 వేల క్యూసెక్కులు, మున్నేరు, కట్టలేరు, వైరాల నుంచి మరో 5వేల క్యూసెక్కులు కలిసి 80 వేల క్యూసెక్కుల నీరు కృష్ణానదికి వచ్చి చేరుతుంది. పులిచింతల డ్యామ్‌ నుంచి నీటిని పూర్తిగా నిలిపివేసి ప్రకాశం బ్యారేజి గేట్లు తెరిస్తే తప్పితే.. ఈ లారీలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే ఇసుక కోసం ఈ లారీలు వెళ్లి సుమారు 24 గంటల సమయం దాటుతోంది.

హైదరాబాద్‌-విజయవాడ నేషనల్ హైవే నుంచి చెవిటికల్లు మీదుగా కృష్ణానది క్వారీకి వచ్చే రోడ్డు అధ్వానంగా తయారైంది. కనీసం నడిచేందుకు సరైన రోడ్డుమార్గం లేదు. అర్ధరాత్రి నుంచి వరద నీటిలో చిక్కుకున్న లారీ డ్రైవర్లు, క్లీనర్లు, కూలీలు అనేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు వరదలో చిక్కుకున్న లారీలు నీటి ఎద్దడికి దెబ్బతింటున్నాయని లారీ ఓనర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల స్థాయి అధికారులే అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఉన్నతాధికారులెవ్వరూ పట్టించుకోకపోతే లారీలు డ్యామేజ్ అవుతాయని ఓనర్స్ వాపోతున్నారు.

Also Read: పాల చాటు మద్యం.. చూస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది

“నేనే మంత్రాలతో చంపా.. పూజలతో మళ్లీ బ్రతికిస్తా”.. జగిత్యాలలో కలకలం