Anantapur District: పాల చాటు మద్యం… చూస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది

పండ్ల చాటు మద్యం చూశాం.. పూల చాటు మద్యం చూశాం.. తాజాగా పాల చాటు మద్యం వెలుగులోకి వచ్చింది. పాలచాటు మద్యమా..?

Anantapur District: పాల చాటు మద్యం... చూస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది
Illegal Liquor
Follow us

|

Updated on: Aug 14, 2021 | 3:11 PM

పండ్ల చాటు మద్యం చూశాం.. పూల చాటు మద్యం చూశాం.. తాజాగా పాల చాటు మద్యం వెలుగులోకి వచ్చింది. పాలచాటు మద్యమా..? అదేలా సాధ్యం అనుకుంటున్నారా..? మద్యం అక్రమ రవాణా కోసం కొందరు అక్రమార్కులు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. పోలీసుల కంట పడకుండా తప్పించుకోడానికి కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఇక వీళ్ల ప్లాన్స్‌ చూస్తే.. పోలీసులకే దిమ్మతిరిగిపోతుంది.  జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అంటారు పెద్దలు. ఆ తెలివితోనే కాసులు దండుకుంటున్నారు కొందరు. ప్రభుత్వం నిబంధనలు విధిస్తే వాటినుంచి తప్పించుకునేందుకు దొడ్డిదార్లు తొక్కతున్నారు. సర్కారు కంటే షార్ప్‌గా ఆలోచన చేసి భారీగా సంపాదిస్తున్నారు. పోలీసుల కళ్లు కప్పి పొరుగు మద్యాన్ని రాష్ట్రంలోకి తెచ్చేందుకు కొత్త కొత్త పద్ధతులు ఎంచుకుంటున్నారు. తాజాగా అనంతపురం జిల్లా విదపనకల్ మండలం డొనేకల్ చెక్‌పోస్ట్‌ వద్ద పాల వ్యాన్‌లో భారీ మొత్తంలో మద్యం సీసాలు పట్టుబడ్డాయి.

గ్రామంలో నిత్యం పాలు సరఫరా చేసే వాహనంలో ఓ రహస్య కంపార్ట్మెంట్ ఒకటి ఏర్పాటు చేశారు. ఎవరికీ ఏ మాత్రం డౌట్‌ రాకుండా అందులో మద్యం కాటన్లు సర్దుకుని యధేచ్చగా అక్రమ రవాణా సాగిస్తున్నారు. పక్కా సమాచారంతో ఎస్‌ఈబీ అధికారులు దాడులు నిర్వహించడంతో ఈ పాల చాటు మద్యం దందా బట్టబయలు అయింది. ఏడాది కాలంగా ఈ తరహా మద్యం అక్రమ రవాణా సాగిస్తున్నట్లు అధికారులు తేల్చారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుండి డోన్‌కు వేలాది టెట్రా ప్యాకెట్ల రూపంలో మద్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో రోజుకు దాదాపు 10లక్షల విలువైన అక్రమ వ్యాపారం నడుస్తున్నట్లు తేల్చారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పాల వ్యాన్‌ను సీజ్‌ చేశారు.

Also Read:  “నేనే మంత్రాలతో చంపా.. పూజలతో మళ్లీ బ్రతికిస్తా”.. జగిత్యాలలో కలకలం

జంతువుల వెంట్రుకల్ని దొంగిలించే పక్షులు.. పెద్ద రీజనే ఉందడోయ్