Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: “నేనే మంత్రాలతో చంపా.. పూజలతో మళ్లీ బ్రతికిస్తా”.. జగిత్యాలలో కలకలం

నింగిలో అద్భుతాలు చేసే స్థాయికి వెళ్లాం. కానీ కొందరి మెదళ్లలోనుంచి మూఢనమ్మకాలను మాత్రం...

Telangana: నేనే మంత్రాలతో చంపా.. పూజలతో మళ్లీ బ్రతికిస్తా.. జగిత్యాలలో కలకలం
Dead Body Worship
Follow us
Ram Naramaneni

| Edited By: Anil kumar poka

Updated on: Aug 14, 2021 | 7:59 PM

నింగిలో అద్భుతాలు చేసే స్థాయికి వెళ్లాం. కానీ కొందరి మెదళ్లలోనుంచి మూఢనమ్మకాలను మాత్రం తొలగించలేకపోతున్నాం. తాజాగా  చనిపోయిన వ్యక్తిని  బతికిస్తానంటూ శవం దగ్గర పూజలు చేసిన ఘటన జగిత్యాల టీఆర్‌ నగర్‌లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల రూరల్‌ మండలం  టీఆర్‌ నగర్‌లో ఓర్సు రమేష్‌ అనే వ్యక్తి చనిపోయాడు. మంత్రాల కారణంగానే రమేష్ మృతి చెందాడని.. పుల్లయ్య అనే వ్యక్తిని బాధిత కుటుంబ సభ్యులు, సన్నిహితులు చితక బాదారు. దెబ్బలకు తాళలేక.. తానే మంత్రాలతో రమేష్‌ని చంపానని, మంత్రాలతో మళ్లీ అతడికి పునర్జీవం తెస్తానంటూ ఉదయం నుంచి శవం దగ్గర పుల్లయ్య పూజలు చేయడం ప్రారంభించాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట పోలీసులకు చేరింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పుల్లయ్యను అదుపులోకి తీసుకున్నారు. రమేశ్‌ డెడ్‌బాడీని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు.  పుల్లయ్యను పోలీసులు తీసుకెళ్లటంతో మృతుని బంధువుల ధర్నాకు దిగారు. దీంతో కరీంనగర్ – జగిత్యాల రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. 

 రెండేళ్ల కూతురును చంపి.. తల్లి ఆత్మహత్యాయత్నం

ఏపీలోని అనంతపురం జిల్లా ధర్మవరంలోని కొత్తపేటలో దారుణం చోటుచేసుకుంది. రెండున్నరేళ్ల చిన్నారిని కన్న తల్లే దారుణంగా హత్య చేసింది. కొత్తపేట కాలనీలో మీనాక్షి, శ్రీనివాసులు దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. శ్రీనివాసులు చేనేత పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దంపతుల మధ్య గత కొంతకాలంగా చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం శ్రీనివాసులు తన పెద్ద కుమార్తె తనుశ్రీని తీసుకుని బయటకు వెళ్లాడు. అదే సమయంలో మీనాక్షి.. తన చిన్న కుమార్తె ప్రణతి(2)ని కత్తితో పొడిచి చంపేసింది. ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్థానికులు వెంటనే భర్త శ్రీనివాసులుకు సమాచారం అందించారు. ఇంటికి చేరుకున్న శ్రీనివాసులు… మీనాక్షిని అనంతపురం గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. భార్యాభర్తల మధ్య నెలకొన్న విభేదాలతోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:నాగుల పంచమి వేళ పాముకు హ్యపీ బర్త్ డే.. నెట్టింట రచ్చ చేస్తోన్న వీడియో

జంతువుల వెంట్రుకల్ని దొంగిలించే పక్షులు.. పెద్ద రీజనే ఉందడోయ్

సంకల్ప బలం ముందు తలవంచిన వైకల్యం.. మరుగుజ్జు ఐఏఎస్ ఆఫీసర్ ఆర్తి డోగ్రా విజయ గాథ

హిజ్రాపై మోజుపడ్డ యువకుడు.. మాట ముచ్చటతో దగ్గరయ్యారు.. తనను దూరం చేయడం తట్టులేక..

యవ్వనంగా కనిపించాలంటే ఈ టాప్ బెస్ట్ ఫుడ్స్ ని తీసుకోండి..!
యవ్వనంగా కనిపించాలంటే ఈ టాప్ బెస్ట్ ఫుడ్స్ ని తీసుకోండి..!
ట్రంప్ టారిఫ్ మోత.. భారత్‌కు తప్పదా వాత?
ట్రంప్ టారిఫ్ మోత.. భారత్‌కు తప్పదా వాత?
జానీ మాస్టర్ కూతురి బర్త్ డే వేడుకల్లో సినీ తారలు.. ఫొటోస్ ఇదిగో
జానీ మాస్టర్ కూతురి బర్త్ డే వేడుకల్లో సినీ తారలు.. ఫొటోస్ ఇదిగో
అలర్ట్: ఈ వస్తువులను తాకితే వెంటనే చేతులు కడగాలట..!
అలర్ట్: ఈ వస్తువులను తాకితే వెంటనే చేతులు కడగాలట..!
గుడ్ న్యూస్.. తిరుపతి నుంచి పళనికి స్పెషల్ బస్ సర్వీస్.. తక్కువకే
గుడ్ న్యూస్.. తిరుపతి నుంచి పళనికి స్పెషల్ బస్ సర్వీస్.. తక్కువకే
బజాజ్‌ పల్సర్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. బైక్‌పై భారీ డిస్కౌంట్‌!
బజాజ్‌ పల్సర్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. బైక్‌పై భారీ డిస్కౌంట్‌!
నిమ్మ తోట దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు.. ఆపి చెక్ చేయగా
నిమ్మ తోట దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు.. ఆపి చెక్ చేయగా
బావిలో పూడిక తీస్తుండగా ఘోరం.. 8మంది మృతి!
బావిలో పూడిక తీస్తుండగా ఘోరం.. 8మంది మృతి!
వెంకటేష్ అయ్యర్ ఊచకోత.. హైదరాబాద్ ముందు భారీ టార్గెట్
వెంకటేష్ అయ్యర్ ఊచకోత.. హైదరాబాద్ ముందు భారీ టార్గెట్
పుష్ప3లో విలన్లుగా విజయ్ దేవరకొండతో పాటు ఆ స్టార్ హీరో కూడా !
పుష్ప3లో విలన్లుగా విజయ్ దేవరకొండతో పాటు ఆ స్టార్ హీరో కూడా !