AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Job Fraud: ఎయిర్‌ పోర్ట్‌లో నెలకు రూ. లక్షన్నర ఉద్యోగమంటూ భారీగా వసూళ్లు.. ఉద్యోగం ఏమైందని ప్రశ్నించగానే..

Job Fraud: నిరుద్యోగుల అవసరాన్ని క్యాష్‌ చేసుకుంటూ మోసాలకు దిగుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు వసూళు చేయడం తీరా చివరికి మోసం చేయడం..

Job Fraud: ఎయిర్‌ పోర్ట్‌లో నెలకు రూ. లక్షన్నర ఉద్యోగమంటూ భారీగా వసూళ్లు.. ఉద్యోగం ఏమైందని ప్రశ్నించగానే..
Job Farud
Narender Vaitla
|

Updated on: Aug 14, 2021 | 12:43 PM

Share

Job Fraud: నిరుద్యోగుల అవసరాన్ని క్యాష్‌ చేసుకుంటూ మోసాలకు దిగుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు వసూళు చేయడం తీరా చివరికి మోసం చేయడం ఎక్కువుతోంది. తాజాగా ఇలాంటి ఓ మోసమే కర్నూలులో వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన విజయ్‌ కుమార్‌ (24) అనే వ్యక్తి ఎయిర్‌ లైన్స్‌లో ఉద్యోగం చేస్తున్నానని స్థానికులతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే విశాఖపట్నం ఎయిర్‌ పోర్టులో కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు ఉన్నాయని. రూ. 1,24,000 చెల్లిస్తే ఉద్యోగం వస్తుందంటూ స్థానికంగా ఉన్న కొందరు యువకులను నమ్మపలికాడు. అక్కడితో ఆగకుండా సదరు యువకులను ఒకటి, రెండు సార్లు విశాఖ తీసుకెళ్లి అధికారులను కూడా కల్పించాడు. అలాగే తాను కస్టమ్స్ అధికారిగా పనిచేస్తున్నట్లు ఓ ఫేక్ ఐడీని కూడా రూపొందించాడు. దీంతో పూర్తిగా నమ్మిన యువకులు విజయ్‌కి భారీగా డబ్బులు ముట్టజెప్పారు.

ఇలా విజయ్‌ ఒకరికి తెలియకుండా మరొకరి దగ్గర దాదాపు 20 మంది నుంచి ఏకంగా రూ. 50 లక్షలకుపైగా వసూళు చేశాడు. వీరిలో విజయ్‌ స్నేహితులు కూడా ఉండడం గమనార్హం. అయితే డబ్బులు వసూళు చేసి చాలా రోజులు అవుతోన్న ఉద్యోగం గురించి ఎలాంటి సమాచారం రాకపోవడంతో బాధితులు విజయ్‌ని ఒకటి, రెండు సార్లు ప్రశ్నించారు.. దీనికి విజయ్‌ బదులిస్తూ కరోనా కారణంగా ఉద్యోగ నియామకం ఆగిపోయింది. ఇంకాస్త సమయం పడుతుందని చెబుతూ వచ్చాడు. అయితే బాధితులు ఒత్తిడి పెంచేసరికి రాత్రికి రాత్రి ఊరి నుంచి పారిపోయాడు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు జిల్లా ఎస్పీని కలిసి జరిగిన విషయాన్ని తెలిపారు. విచారణ ప్రారంభించిన పోలీసులు పారిపోయిన విజయ్‌ని వెతికే పనిలో పడ్డారు. చిన్ననాటి నుంచి తెలిసిన వ్యక్తే కదా… అని నమ్మి డబ్బులిస్తే ఇలా మోసం చేశాడంటూ బాధితుతులు వాపోతున్నారు.

Also Read: Nikhil Siddharth: యంగ్ హీరో నిఖిల్‌‌‌ను సన్మానించిన సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్.. ఎందుకంటే

PM MODI: అదో భయంకరమైన రోజు.. స్వాతంత్ర సంబరాలకు ముందు రోజును గుర్తు చేసుకున్న ప్రధాని మోడీ..

Tea Side Effects: గరం గరం చాయ్‌ని తెగ లాగించేస్తున్నారా..? అయితే ఈ సమ్యసలను కొని తెచ్చుకున్నట్లే.