Gallantry Medals: గ్యాలంటరీ పోలీసు పతకాలను ప్రకటించిన కేంద్ర హోం శాఖ.. తెలంగాణకు 14, ఆంధ్రప్రదేశ్‌కు 11
స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ప్రతి ఏటా సైనిక, పోలీసు అధికారులకు అందించే వివిధ పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
Police Gallantry Awards: స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ప్రతి ఏటా సైనిక, పోలీసు అధికారులకు అందించే వివిధ పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వివిధ రాష్ట్రాలకు చెందిన 1,380 మంది పోలీసులకు పతకాలను ప్రకటిస్తూ.. ఆ జాబితాను కేంద్రం విడుదల చేసింది. ఇద్దరికి అత్యున్నతమైన రాష్ట్రపతి పోలీసు పతకాలు ( PPMG ) ప్రకటించగా, 628 మంది గ్యాలంటరీ పోలీసు పతకాలు ప్రకటించారు. 88 మందికి రాష్ట్రపతి పోలీసు పతకాలు, 662 మందికి విశిష్ట సేవా పతకాలను అందించనున్నారు. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 11 మందికి, తెలంగాణకు చెందిన 14 మందికి గ్యాలంటరీ పోలీసు పతకాలు దక్కాయి. తెలంగాణకు చెందిన 14 మంది పోలీసు అధికారులకు గ్యాలంటరీ పోలీసు పతకాలు, మరో 11 మందికి ఉత్తమ సేవా పోలీసు పతకాలు వరించాయి. తెలంగాణకు చెందిన అడిషనల్ డీజీపీ, వుమెన్ సెఫ్టీవింగ్ ఇంచార్జి స్వాతి లక్రా, జనగామ వెస్ట్ జోన్ డిప్యూటీ పోలీసు కమిషనర్ బండ శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీసు పతకాలు దక్కాయి. వీటిని ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ అందజేయనున్నారు.
అయితే, కాగా, జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో ధైర్యంగా పనిచేసినందుకు 398 మంది పోలీసు సిబ్బందికి, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పని చేసిన155 మంది సిబ్బందితో పాటు ఈశాన్య ప్రాంతంలో 27 మంది సిబ్బందికి బహుమతులు అందజేస్తున్నారు. అయితే, శౌర్య పతకాల పురస్కార గ్రహీతల్లో జమ్మూ కశ్మీర్ పోలీసుల నుండి 256, సీఆర్‌పీఎఫ్ నుంచి 151, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు నుండి 23, ఒడివా పోలీసుల నుంచి 67, మహారాష్ట్ర పోలీసులు 25, ఛత్తీస్‌గడ్ నుంచి 20 ఇక, ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి పోలీసులను ఎంపిక చేశారు. జమ్మూ కశ్మీర్ పోలీస్ సబ్-ఇన్స్‌పెక్టర్ అమర్ దీప్‌కు అత్యున్నత శౌర్య పురస్కారం లభించగా, హెడ్ కానిస్టేబుల్ దివంగత కాలే సునీల్ దత్తాత్రేయకు మరణానంతరం రాష్ట్రపతి పోలీసు మెడల్ వరించింది. ఏటా గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఈ పతకాలను పోరాట ప్రతిభ కనబర్చిన పోలీసులకు భారత ప్రభుత్వం తరఫున అందజేస్తారు.
President’s Medals awarded to Fire Service, Home Guards (HG) and Civil Defence (CD) personnel on the occasion of Independence Day, 2021
Press release- https://t.co/nGbFrOZwvm#AzadiKaAmritMahotsav pic.twitter.com/tZCb51U2tK
— Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) August 14, 2021