AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mizoram Election Result 2023: మిజోరం జొరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ ఘనవిజయం.. సీఎంగా లాల్‌దుహోమా

మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో జొరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌-ZPM విజయం సాధించింది. 40 సీట్ల అసెంబ్లీలో 27 సీట్లను ఆ పార్టీ సాధించింది. ZPM ముఖ్యమంత్రి అభ్యర్ధి లాల్‌దుహోమా గెలిచారు. ఈ ఎన్నికల్లో అధికార మిజో నేషనల్‌ ఫ్రంట్‌కు 10 సీట్లు, బీజేపీకి రెండు సీట్లు దక్కాయి. కాంగ్రెస్‌ ఒక్కసీటుకు పరిమితం.

Mizoram Election Result 2023: మిజోరం జొరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ ఘనవిజయం.. సీఎంగా లాల్‌దుహోమా
Mizoram Election Result
Balaraju Goud
|

Updated on: Dec 04, 2023 | 9:10 PM

Share

మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో జొరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌-ZPM ఘన విజయం సాధించింది. 27 సీట్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది. లాల్‌దుహోమా సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు.

మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో జొరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌-ZPM విజయం సాధించింది. 40 సీట్ల అసెంబ్లీలో 27 సీట్లను ఆ పార్టీ సాధించింది. ZPM ముఖ్యమంత్రి అభ్యర్ధి లాల్‌దుహోమా గెలిచారు. ఈ ఎన్నికల్లో అధికార మిజో నేషనల్‌ ఫ్రంట్‌కు 10 సీట్లు, బీజేపీకి రెండు సీట్లు దక్కాయి. కాంగ్రెస్‌ ఒక్కసీటుకు పరిమితం అయింది. ముఖ్యమంత్రి జొరామ్‌తంగా కూడా ఎన్నికల్లో ఓడిపోయారు.

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ కంభంపాటి హరిబాబును కలిసి తన రాజీనామా లేఖను ఇచ్చారు సీఎం జోరామ్‌ తంగా. ఎన్నికల్లో ఓటమిని ఊహించలేదన్నారు జోరామ్‌ తంగా . మిజోరం అసెంబ్లీకి 40 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 21 కాగా, మిజోరం మరో ఆరు ఎక్కువ సీట్లకే కైవసం చేసుకుంది.

మిజోరామ్‌కు CMగా 74 ఏళ్ల లాల్‌దూ హోమా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈయన IPSగా పనిచేసి, ఒకప్పడు ఇందిరాగాంధీకి సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. మిజో మిలిటెంట్‌ గ్రూప్‌ లీడర్‌ లాల్‌ డెంగాతో ఇందిర ప్రభుత్వం చర్చలకు వెళ్లినపుడు, ఉద్యోగానికి రాజీనామా చేశారు. మిజోరాం రాష్ట్రంగా 1987లో ఏర్పడినపుడు రాజీవ్‌ సారధ్యంలో శాంతిఒప్పందంపై సంతకం చేశారు. ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికై, మూడుసార్లు CMగా పనిచేశారు.

మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 7న పోలింగ్‌ జరిగింది. మిజోరంలో మొత్తం 8.57 లక్షల మంది ఓటర్లు ఉండగా, వారిలో 80 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 174 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. జోరం పీపుల్స్ మూవ్‌మెంట్‌ ఆరు పార్టీల కూటమి. ఇందులో మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్, జోరామ్ నేషనలిస్ట్ పార్టీ, జోరామ్ ఎక్సోడస్ మూవ్‌మెంట్, జోరామ్ డిసెంట్రలైజేషన్ ఫ్రంట్, జోరామ్ రిఫార్మేషన్ ఫ్రంట్, మిజోరం పీపుల్స్ పార్టీ. ఈ పార్టీలన్నీ జెడ్‌పీఎం కూటమిగా అసెంబ్లీ బరిలోకి దిగాయి.

జీపీఎం స్థాపించిన కొద్ది ఏళ్లలోనే మిజోరంలో గణనీయంగా దీని ప్రాధాన్యతను సంపాదించుకుంది. ఈ పార్టీని 2017లో స్థాపించారు. తొలిసారి 2018 మిజోరం అసెంబ్లీ ఎన్నికలలో 40 సీట్లలో పోటీ చేసి.. కేవలం ఆరు సీట్లలో విజయం సాధించింది. ఆ మరుసటి ఏడాది కేంద్ర ఎన్నికల సంఘం నుంచి జీపీఎం ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..