Chennai: మిగ్ జాం తుపాను తో చెన్నై అతలాకుతలం.! స్కూళ్లు, కార్యాలయాలు మూసివేత.
నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్‌జాం తుపాను తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది. ఆదివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో నగరం మొత్తం జలమయం అయింది. స్కూళ్లు, కార్యాలయాలు మూసివేశారు. పలు విమాన సర్వీసులు నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్‌జాం తుపాను తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది. ఆదివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో నగరం మొత్తం జలమయం అయింది. స్కూళ్లు, కార్యాలయాలు మూసివేశారు. పలు విమాన సర్వీసులు నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీవర్షాలతో ఇళ్లు, కాలనీలు నీటమునిగాయి. పార్క్ చేసిన వాహనాలు వరదనీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. చెన్నై ఎయిర్‌పోర్ట్ సైతం నీట మునిగింది. కోయంబత్తూరు- చెన్నై మధ్యలో రెండు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. చాలా విమానాలను చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి మళ్లించారు. ఇప్పటి వరకు దాదాపు 11 విమానాలను దారి మళ్లించినట్లు సమాచారం. నగరంలోని 14 రైల్వే సబ్‌వేల్లోకి నీరు చేరడంతో వాటిని మూసివేశారు. పలు రైళ్లను రద్దు చేశారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నగరం, చుట్టుపక్కల జిల్లాల్లో మరో 24 గంటలపాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను ఇప్పటికే చెన్నైలో మోహరించారు. వర్షానికి తోడు బలమైన ఈదురు గాలులు వీస్తుండటతో పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అంధకారంలో గడుపుతున్నారు. రోడ్లు నదులను తలపిస్తున్నాయి.
తమిళనాడు ప్రభుత్వం చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూర్, కాంచీపురం జిల్లాల్లో పబ్లిక్ హాలీడే ప్రకటించింది. ఈ నాలుగు జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని తమిళనాడు సీఎస్ శివ్ దాస్ మీనా పేర్కొన్నారు. ఈ నాలుగు జిల్లాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు కార్యాలయాలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మూసివేయాలని సీఎస్ ఆదేశించారు. విపత్తు నిర్వహణ, సహాయక చర్యలతో సంబంధం ఉండే అన్ని అత్యవసర సర్వీసులు, హోటళ్లు, రెస్టారెంట్లు సాధారణ కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చని పేర్కొన్నారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇళ్లనుంచి బయటకు రావద్దని నగరపాలక వర్గాలు విజ్ఞప్తి చేశాయి. తాంబ్రం ప్రాంతంలో ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు.. నీటిలో చిక్కుకొన్న 15 మందిని కాపాడాయి. బాసిన్ బ్రిడ్జ్, వ్యాసర్‌పాడి మధ్యలోని 14వ నెంబరు బ్రిడ్జ్‌ను మూసివేసినట్లు ప్రకటించారు. ఈ ప్రాంతంలో చాలా ప్రదేశాలు జలమయమయ్యాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.