Rain Alert: దక్షిణకోస్తాకు ముప్పు..! తీరం దాటే సమయంలో సముద్రంలో ఎగసిపడనున్నఅలలు.
బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్ జాం తుపాను దక్షిణకోస్తాకు పెను ముప్పుగా మారబోతోంది. తీవ్ర తుపానుగా మారిన మిగ్‌జాం బాపట్ల సమీపంలో మంగళవారం తీరం దాటనుందని, ఈ సమయంలో సముద్రంలో అలలు ఒకటిన్నర మీటర్ల ఎత్తువరకూ ఎగసి పడతాయని తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద హెచ్చరించారు. దక్షిణ కోస్తా ప్రాంత ప్రజలకు ముప్పు పొంచిఉందని, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్ జాం తుపాను దక్షిణకోస్తాకు పెను ముప్పుగా మారబోతోంది. తీవ్ర తుపానుగా మారిన మిగ్‌జాం బాపట్ల సమీపంలో మంగళవారం తీరం దాటనుందని, ఈ సమయంలో సముద్రంలో అలలు ఒకటిన్నర మీటర్ల ఎత్తువరకూ ఎగసి పడతాయని తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద హెచ్చరించారు. దక్షిణ కోస్తా ప్రాంత ప్రజలకు ముప్పు పొంచిఉందని, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.తుఫాను తీరం దాటే సమయంలో 110 కిలో మీటర్ల వేగంగతో బలమైన గాలులు వీస్తాయని, ఇళ్లు కూలిపోయే ప్రమాదముందని హెచ్చరించారు. తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ప్రధాన పోర్టుల్లో పదో నెంబరు ప్రమాద సూచికను జారీ చేశారు. తుపాను తీరం దాటిన తర్వాత కూడా దక్షిణ కోస్తాపై ప్రభావం ఉంటుందని, మరో రెండు రోజులు బారీ వర్షాలు కురుస్తాని ప్రకటించారు. ఈ నేపథ్యంలో దక్షిణకోస్తా, రాయలసీమకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.