Manipur Firing: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. రెండు తెగల మధ్య కాల్పుల్లో 13మంది మృతి
మణిపూర్‌లో మళ్లీ కాల్పుల మోత మోగింది. తెంగ్‌నౌపాల్ జిల్లాలోని లీతూ గ్రామంలో రెండు తెగల మధ్య జరిగిన ఘర్షణలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే లీతూ ప్రాంతంలో మరణించిన వాళ్లు స్థానికులు కాదని అధికారులు చెప్తు్న్నారు. వారంతా ఇతర ప్రాంతం నుంచి వచ్చి ఉంటారని భావిస్తున్నారు.

మణిపూర్‌లో ఏడు నెలలుగా నెలకొన్న హింసాత్మక పరిస్థితులు చక్కబడుతున్నాయని అనుకునేలోపే మళ్లీ మొదటికి వచ్చేలా కనిపిస్తున్నాయి. తాజాగా మరోసారి కాల్పులు జరగడం కలకలం రేపుతోంది.
మణిపూర్‌లో మళ్లీ కాల్పుల మోత మోగింది. తెంగ్‌నౌపాల్ జిల్లాలోని లీతూ గ్రామంలో రెండు తెగల మధ్య జరిగిన ఘర్షణలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే లీతూ ప్రాంతంలో మరణించిన వాళ్లు స్థానికులు కాదని అధికారులు చెప్తు్న్నారు. వారంతా ఇతర ప్రాంతం నుంచి వచ్చి ఉంటారని, అందులోని కొందరు కాల్పులు జరిపి ఉండొచ్చనే అనుమానం వ్యక్తంచేస్తున్నారు. దీంతో మళ్లీ ఉద్రిక్త వాతావరణం పరిస్థితులు నెలకొన్నాయి.
మెయిటీ మిలిటెంట్ వర్గమైన UNLFకి, భారత ప్రభుత్వానికి మధ్య డిసెంబర్ 3న శాంతి ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాన్ని తెంగ్‌నౌపాల్ జిల్లాలోని కుకీ – జో గిరిజన తెగలు స్వాగతించాయి. ఈ పరిణామాల తర్వాత డిసెంబర్ 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను మణిపూర్ ప్రభుత్వం ఆదివారం పునరుద్ధరించింది. కుకీ, మైతీల ఆధిపత్యం ఉన్న ప్రాంతాల నుంచి రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాలను మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో డిసెంబర్ 18వరకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇది జరిగిన 24 గంటల్లోనే కాల్పులు జరగడం ఆందోళన కలిగించే అంశం.
మణిపూర్‌లో జాతుల మధ్య హింస చెలరేగడంతో మే 3 నుంచి రాష్ట్రం పూర్తిగా భద్రతా వలయంలోకి వెళ్లింది. అప్పటి నుంచి పూర్తిగా ఆంక్షల వలయంలోనే ఉంది మణిపూర్. ప్రత్యేక బలగాలతో శాంతిభద్రతలు పర్యవేక్షిస్తున్న కేంద్రం.. పరిస్థితులను అదుపుచేసే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ఏడు నెలల తర్వాత ఇంటర్నెట్‌ని తాత్కాలికంగా పునరుద్ధరించింది. ఇంతలోనే మళ్లీ కాల్పులు జరగడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
