Stock Market: మూడు రాష్ట్రాల్లో బీజేపీ విక్టరీతో బుల్‌రన్.. బీఎస్‌ఈ చరిత్రలో మరో బిగ్ మండే!
విక్టరీ సింబల్ చూపిన మోదీ.. రంకెలేసిన బుల్... ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన సూచీలు... మదుపర్లకు లాభాలే లాభాలు. ఇదే.. దేశీయ స్టాక్‌మార్కెట్లకు ఇది బిగ్ అండ్ బిగ్గెస్ట్ మండే. సోమవారం ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన మార్కెట్లు... సరికొత్త హైట్స్‌ని టచ్ చేస్తూ క్లోజింగ్ సమయానికి ఆల్‌టైమ్ రికార్డులు నమోదు చేసుకుంది.

రాజకీయ స్థిరత్వానికి, స్టాక్ మార్కెట్లకు అవినాభావ సంబంధం ఉంది. అందుకే, పొలిటికల్ బ్రేకింగ్ న్యూస్ వచ్చిన ప్రతీసారీ మార్కెట్లలో కుదుపును చూస్తుంటాం. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా మార్కెట్లలో జోరును పెంచేశాయి. మూడు రాష్ట్రాల్లో మోదీ గెలుపు… మదుపర్ల సంపదను ఏకంగా 5 లక్షల కోట్లు పెంచేసింది. ఇక్కడ బిగ్గెస్ట్ గెయినర్లలో అదానీ గ్రూప్ కూడా ఉంది.
విక్టరీ సింబల్ చూపిన మోదీ.. రంకెలేసిన బుల్… ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన సూచీలు… మదుపర్లకు లాభాలే లాభాలు. ఇదే.. దేశీయ స్టాక్‌మార్కెట్లకు ఇది బిగ్ అండ్ బిగ్గెస్ట్ మండే. సోమవారం ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన మార్కెట్లు… సరికొత్త హైట్స్‌ని టచ్ చేస్తూ క్లోజింగ్ సమయానికి ఆల్‌టైమ్ రికార్డులు నమోదు చేసుకుంది. ఈ దూకుడుకు ప్రధాన కారణం తాజా ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం.
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్, మార్కెట్లలో గత వీకెండ్‌లోనే కనిపించింది. చివరి నాలుగు సెషన్లలో 500 పాయింట్లు పెరిగింది. సోమవారం కూడా ఇదే జోరు కంటిన్యూ ఔతుందని భావించారు. దానికి తగ్గట్టే, 64 వేల 435 పాయింట్ల దగ్గర భారీ లాభాలతో ప్రారంభమైంది BSE సెన్సెక్స్. ఇంట్రాడేలో 68 వేల 918 పాయింట్ల దగ్గరకు చేరి ఆల్‌టైమ్ రికార్డ్ నమోదు చేసింది. చివరకు 1383 పాయింట్ల లాభంతో 68 వేల 865 పాయింట్ల దగ్గర స్థిరపడింది. ఇది ఆల్‌టైమ్ హై.
టాటామోటార్స్, విప్రో తప్పితే మిగతా అన్ని షేర్లూ లాభపడ్డాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లకు పంట పండింది. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ షేర్లు నాలుగు శాతం లాభాల్ని గడించాయి. ఇదే ఊపులో అదానీ గ్రూపునకు చెందిన సంస్థలు సైతం దూసుకువెళ్లాయి. టోటల్‌గా బీఎస్‌ఈ రిజిస్టర్డ్ కంపెనీల మార్కెట్ విలువ ఈ ఒక్కరోజే 5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెరిగింది. డాలరుతో రూపాయి మారకపు విలువ కూడా 6 పైసలు పెరిగింది.
ఈ ర్యాలీకి కారణాలు ఎన్నున్నా ప్రధాన కారణం మాత్రం ఆదివారం విడుదలైన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే. తెలంగాణ తప్పితే, మిగతా మూడు రాష్ట్రాల్లోనూ విజయ ఢంకా మోగించిన బీజేపీ మదుపర్లలో ఉత్సాహం నింపింది. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కూడా మోదీ హవా రిపీట్ అవుతుందన్న అంచనాలు, రాజకీయ సుస్థిరతకు నేనే గ్యారంటీ అంటూ మోదీ ఇచ్చిన స్టేట్‌మెంట్, ఆర్థిక పరమైన భరోసానిచ్చింది. ఇండియన్ ఎకానమీకి ఢోకా లేదన్న మదుపర్ల కాన్ఫిడెన్స్, స్టాక్‌మార్కెట్లపై ఇలా సానుకూల ప్రభావం చూపింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌లో బీజేపీ కొట్టిన విక్టరీలతో బుల్స్ రీఛార్జ్ అవుతాయని ఆదివారం నాడే అనలిస్టులు అంచనా వేశారు. దానికి తగ్గట్టే మార్కెట్లలో బిగ్ మండే నమోదైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…