పార్టీ అధిష్టానం నుంచి మెసేజ్ రాగానే తెలియజేస్తా..కర్ణాటక సీఎం ఎడ్యూరప్ప ప్రకటన:yedyurappa.
తన రాజకీయ భవితవ్యం గురించి బీజేపీ హైకమాండ్ నుంచి ఈ సాయంత్రం ఏదైనా సందేశం (మెసేజ్) రావచ్చునని, అది అందగానే మీడియాకు తెలియజేస్తానని కర్ణాటక సీఎం ఎడ్యూరప్ప ప్రకటించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..
తన రాజకీయ భవితవ్యం గురించి బీజేపీ హైకమాండ్ నుంచి ఈ సాయంత్రం ఏదైనా సందేశం (మెసేజ్) రావచ్చునని, అది అందగానే మీడియాకు తెలియజేస్తానని కర్ణాటక సీఎం ఎడ్యూరప్ప ప్రకటించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అధిష్టానం నుంచి మెసేజ్ అందుతుందనే భావిస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో ఎడ్యూరప్ప నాయకత్వ మార్పు తథ్యమని ఊహాగానాలు మరింత బలం పుంజుకుంటున్న వేళ… ఆయన ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయం చెప్పారు. ఈ నెల 26 తో తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అవుతుందని, ఆ సందర్భంగా ఇక్కడ ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఆ వెంటనే పార్టీ హైకమాండ్ ఏది నిర్ణయించినా దానికి కట్టుబడి ఉంటానన్నారు. అయితే రాష్ట్రం తీవ్ర వరదల పరిస్థితిని ఎదుర్కొంటోంది గనుక ఆయన రాజీనామా విషయమై పార్టీ హైకమాండ్ ఇప్పట్లో నిర్ణయం తీసుకోకపోవచ్చునని కూడా అంటున్నారు. వరదలతో అల్లాడుతున్న బెళగావికి బయల్దేరి వెళ్లే ముందు ఆయన బెంగుళూరులో మీడియాతో మాట్లాడారు.
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక జిల్లాలు వరదలతో సతమతమవుతున్నాయి. ఇప్పటివరకు 9 మంది మరణించగా ముగ్గురు గల్లంతయ్యారు. అనేక చోట్ల ఇళ్ళు కూలిపోవడంతోనో, దెబ్బ తినడంతోనో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వారిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఆల్మట్టి డ్యాం తో సహా పలు డ్యాంలు పూర్తిగా నిండిపోయి ప్రమాద సూచికలను చూపుతున్నాయి. ఈ నెల 28 వరకు కూడా భారీ వర్షాలు పడవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేసింది. రెండేళ్ల క్రితం 2019 లో ఎడ్యూరప్ప రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి చేబట్టినప్పుడు కూడా రాష్ట్రం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. అప్పుడు కొన్ని రోజులుగా కేబినెట్ మంత్రులెవరూ లేక పోవడంతో ఎడ్యూరప్ప స్వయంగా ఆయా జిల్లాలకు వెళ్లి సహాయ చర్యలను సమీక్షించారు.
మరిన్ని ఇక్కడ చూడండి : రెండు డోసులతోనే డెల్టా కు చెక్..!రానున్న మరో ప్రమాదకరమైన మూడు వేరియంట్లు..:Control Delta with two doses Video.