Vice President Election: విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న మార్గరెట్ ఆళ్వా.. ఎన్ని పార్టీలు మద్దతుగా నిలిచాయంటే..

Margaret Alva: లోక్ సభ సెక్రెటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ కు మార్గరెట్ ఆళ్వా నామినేషన్ వేయనున్నారు. ఆమె అభ్యర్థిత్వానికి 17 పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలపగా.. మొత్తం 19 పార్టీలు మద్దతు తెలిపాయి.

Vice President Election: విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న మార్గరెట్ ఆళ్వా.. ఎన్ని పార్టీలు మద్దతుగా నిలిచాయంటే..
Margaret Alva
Follow us

|

Updated on: Jul 19, 2022 | 9:45 AM

భారత కొత్త ఉపరాష్ట్రపతి(Vice President Election) ఎన్నికకు నామినేషన్ దాఖలు చేయడానికి మంగళవారం చివరి రోజు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మార్గరెట్‌ అల్వాను ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దించాయి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అల్వా నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంతకుముందు సోమవారం ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్‌ఖర్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పార్టీ సీనియర్ నేతల సమక్షంలో ధంఖర్ నామినేషన్ దాఖలు చేశారు.

లోక్‌సభ, రాజ్యసభ ఎలక్టోరల్ కాలేజీలో బిజెపికి మెజారిటీ ఉన్నందున ధనఖర్ వైస్ ప్రెసిడెంట్, రాజ్యసభ ఛైర్మన్‌గా ఎన్నిక కావడం దాదాపు ఖాయమని భావిస్తున్నారు. ప్రస్తుత పార్లమెంటు సభ్యుల సంఖ్య 780లో బీజేపీకి మాత్రమే 394 మంది ఉన్నారు. ఈ సంఖ్య మెజారిటీ సంఖ్య 390 కంటే ఎక్కువ. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియగా.. కొత్త ఉపరాష్ట్రపతి ఆగస్టు 11న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఉపరాష్ట్రపతి పదవికి ఆగస్టు 6న ఓటింగ్ నిర్వహించి.. అదే రోజు ఓట్ల లెక్కింపు జరగనుంది. జులై 20న నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. జులై 22 నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేదీ. పార్లమెంట్ భవనం మొదటి అంతస్తులోని రూమ్ నెం.63 లో పోలింగ్ జరగనుంది. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఉదయం 10 నుంచి 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

ఇవి కూడా చదవండి

ఉపరాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా లోక్ సభ సెక్రటరీ జనరల్ వ్యవహరించనున్నారు. కోవిడ్ నిబంధనలను పాటిసస్తూ ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించనున్నారు. ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది.

మార్గరెట్ అల్వా గొప్ప అభ్యర్థి – మల్లికార్జున్ ఖర్గే

లోక్ సభ సెక్రెటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ కు మార్గరెట్ ఆళ్వా నామినేషన్ వేయనున్నారు. ఆమె అభ్యర్థిత్వానికి 17 పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలపగా.. మొత్తం 19 పార్టీలు మద్దతు తెలిపాయి. ఉపరాష్ట్రపతి పదవికి ఇవాళ్టిలో నామినేషన్ల గడువు ముగియనుండటంతో.. మార్గరెట్‌ అల్వా నామినేషన్‌ వేయనున్నారు.

ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్‌ అల్వాపై కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ.. మార్గరెట్‌ ఆల్వా గొప్ప అభ్యర్థి అని అన్నారు. 1974 నుంచి నిరంతరం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆమె 5 సార్లు ఎంపీగా, 4 రాష్ట్రాలకు గవర్నర్‌గా, కేంద్రంలో మంత్రిగా పనిచేసి క్రైస్తవులు మైనారిటీలు కాబట్టి ఇంతకంటే ఏం బాగుంటుంది. 18 పార్టీలు కలిసి మద్దతు ఇస్తాయని కూడా చెప్పారు.

జాతీయ వార్తల కోసం..

సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా