Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alcohol Drinking Age: దీనికీ ఓ లెక్కుంది గురూ.. ఏ వయసు వారు ఎంత ఆల్కహాల్ తీసుకోవాలో తెలుసా.

ఆల్కహాల్ నిరంతర  రోజువారీ వినియోగం శరీరం అనారోగ్యానికి గురయ్యే అవకాశాలను పెంచుతుంది. ఆల్కహాల్ ఎక్కువసేపు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, క్షయ, న్యుమోనియా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

Alcohol Drinking Age: దీనికీ ఓ లెక్కుంది గురూ.. ఏ వయసు వారు ఎంత ఆల్కహాల్ తీసుకోవాలో తెలుసా.
Alcohol
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 18, 2022 | 12:48 PM

ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాల హాని కలుగుతుంది. ఆల్కహాల్ నిరంతర  రోజువారీ వినియోగం శరీరం అనారోగ్యానికి గురయ్యే అవకాశాలను పెంచుతుంది. ఆల్కహాల్ ఎక్కువసేపు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, క్షయ, న్యుమోనియా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. మద్యం సేవించడం వల్ల అనేక రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. లాన్సెట్ జర్నల్ మొదటిసారిగా ఒక అధ్యయనాన్ని ఆల్కహాల్ తీసుకోవడంపై ప్రచురించింది. వయస్సు, లింగం వంటి అంశాల ఆధారంగా మద్యపాన ప్రభావాలను ఉంటుందని పేర్కొంది. మితంగా ఆల్కహాల్ తీసుకోవడం కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.. కానీ అనేక ఇతర వ్యాధుల ప్రమాదాన్ని మాత్రం పెంచుతుంది. ది లాన్సెట్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం, వృద్ధుల కంటే యువకుల ఆరోగ్యానికి మద్యం సేవించడం వల్ల ఎక్కువ ప్రమాదం ఉంది.

పరిశోధన తేలింది ఇదే..

వయస్సు ప్రకారం, మద్యం సేవించే వ్యక్తులపై వీరి అధ్యయనం సాగింది. అధ్యయనంలో ప్రజలు ఏ వయస్సులో ఎంత మద్యం సేవించారు. వారి ఆరోగ్యానికి ఎంత హాని కలిగిస్తుంది. ది లాన్సెట్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. వృద్ధుల కంటే యువకులలో మద్యపానం ఆరోగ్యానికి ఎక్కువ హాని కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ 2020 విశ్లేషణ ప్రకారం, తక్కువ మొత్తంలో ఆల్కహాల్ కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కానీ ఇతర వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. 2020లో దాదాపు 1.34 బిలియన్ల మంది అధిక ఆల్కహాల్‌ను వినియోగించారని పరిశోధకులు కనుగొన్నారు. అధ్యయనం ప్రకారం, ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వ్యక్తులు 15-39 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. ఈ పురుషులు అధిక మద్యం సేవించడం వల్ల ప్రమాదకరమైన వ్యాధులను కలిగి ఉన్నారు.

15-39 సంవత్సరాల వయస్సులో ఆల్కహాల్ తీసుకుంటే..

15-39 సంవత్సరాల వయస్సులోనివారు మద్యం సేవించడం వల్ల ఎటువంటి ఆరోగ్యానికి ప్రయోజనం లేదన్నారు. ప్రయోజనం లేకపోగా వారిని అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. పరిశోధకులు అధ్యయనంలో కనుగొన్నారు. అధ్యయనం ప్రకారం.. ఈ వయస్సులో ఉన్న 60 శాతం మంది ప్రజలు ఏదో ఒక విధంగా మద్యం సేవించడం వల్ల బాధపడ్డారు.

ఎక్కువ మద్యం సేవించే వ్యక్తులు వాహనాల వల్ల ప్రమాదాల బారిన పడే ప్రమాదం ఉంది. అలాంటి వారు ఆత్మహత్యలు, హత్యలు కూడా ఎక్కువగా చేస్తున్నారు. మానసిక వైద్యలు చెప్పిన వివరాల ప్రకారం, చాలా మంది యువత కళాశాల, ఆఫీసు సమయంలో ఎక్కువ మద్యం సేవించడం చేస్తున్నారని తేలిందన్నారు. ఈ యువకులు తక్కువ ధరకు మద్యం తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందని పేర్కొన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, చిన్న వయస్సులో మద్యం సేవించడం వల్ల యువత జీవితకాలం తగ్గిపోతుంది. మద్యం సేవించని వ్యక్తులు 70-75 సంవత్సరాల వరకు జీవించగలరు.

ఎంత ఆల్కహాల్ తీసుకోవడం ఆరోగ్యానికి హాని కలిగించదు

అధ్యయనం ప్రకారం, 15-39 ఏళ్ల వయస్సు ఉన్నవారికి రోజుకు 0.136 ఆల్కహాల్ వినియోగం సరిపోతుంది. ఈ వయస్సులో ఉన్న మహిళలకు, రోజుకు 0.273 ఆల్కహాల్ వినియోగం సరిపోతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

హెల్త్ వార్తల కోసం..