AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur Violence: మణిపూర్‌లో తొలిగిన ఉద్రిక్త పరిస్థితులు.. 11 జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు.. నిత్యావసరాల కోసం మార్కెట్‌కు జనం..

కర్ఫ్యూ సడలింపుతో ప్రజలు నిత్యావసరాల కోసం మార్కెట్‌కు క్యూ కట్టారు..ఇంఫాల్‌లోని ఆల్ వుమెన్ మార్కెట్లో రద్దీగా ఉంది..మహిళా మార్కెట్‌కు మహిళా సీఆర్పీఎఫ్ సిబ్బందితో భద్రత పెట్టారు..మరోవైపు మార్కెట్లో ఆయుధ దుకాణాల బోర్డులను తొలగించారు అధికారులు..ఘర్షణలు చోటుచేసుకున్న సమయంలో ఆయుధ దుకాణాలను లూఠీ చేశారు ఆందోళనకారులు..

Manipur Violence: మణిపూర్‌లో తొలిగిన ఉద్రిక్త పరిస్థితులు.. 11 జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు.. నిత్యావసరాల కోసం మార్కెట్‌కు జనం..
Manipur
Sanjay Kasula
|

Updated on: May 10, 2023 | 1:41 PM

Share

హింసతో అట్టుడికిన మణిపూర్‌లో నెమ్మదిగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. నిత్యావ సరాలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఇళ్లను వీడి బయటకు వస్తున్నారు.ఇవాళ ఉదయం కొన్ని గంటల పాటు కర్ఫ్యూ సడలించారు..కర్ఫ్యూ సడలింపుతో ప్రజలు నిత్యావసరాల కోసం మార్కెట్‌కు క్యూ కట్టారు..ఇంఫాల్‌లోని ఆల్ వుమెన్ మార్కెట్లో రద్దీగా ఉంది..మహిళా మార్కెట్‌కు మహిళా సీఆర్పీఎఫ్ సిబ్బందితో భద్రత పెట్టారు..మరోవైపు మార్కెట్లో ఆయుధ దుకాణాల బోర్డులను తొలగించారు అధికారులు..ఘర్షణలు చోటుచేసుకున్న సమయంలో ఆయుధ దుకాణాలను లూఠీ చేశారు ఆందోళనకారులు.. ఆపై ఇంఫాల్ తంగల్ బజార్‌లోనూ ఆయుధాలు లూటీ చేసే ప్రయత్నం చేశారు అల్లరిమూకను అడ్డుకున్నారు పోలీసులు, భద్రతా సిబ్బంది. ఇంఫాల్‌లో మహిళా మార్కెట్‌ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మహాత్మ అందిస్తారు. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి 11 వరకు కర్ఫ్యూ సడలించారు..ఇప్పుడు మళ్లీ కర్ఫ్యూ మొదలైంది..అ తర్వాత డ్రోన్‌లు, హెలికాప్టర్లు నిశిత పర్యవేక్షణ జరుపుతున్నాయి.

వివిధ ప్రాంతాల్లో ఆర్మీ, అస్సాం రైఫిల్స్‌ ఫ్లాగ్‌ మార్చ్‌లు నిర్వహించాయి. చుర్‌చందాపూర్ సహా మిగతా 7 జిల్లాల్లో ఇప్పటికీ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది..వేల సంఖ్యలో రెండు తెగల ప్రజలను తరలిస్తున్నారు భద్రతా బలగాలు..దాడుల్లో సర్వం కోల్పోయిన అనేక మంది గిరిజనులు బిక్కుబిక్కుమంటున్నారు. కమ్యూనిటీ హాళ్లు, తాత్కాలిక షెల్టర్లలో వారు భయంతో జీవిస్తున్నారు. మణిపూర్‌లో విస్తరించిన హింసలో ఇప్పటివరకు 60 మంది మరణించారు, వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. సడలించింది ఈ జిల్లాల్లో ఇంఫాల్ వెస్ట్, బిష్ణుపూర్, చురచంద్‌పూర్ , జిరిబామ్ ఉన్నాయి. ఇక్కడ ఉదయం 5 గంటల నుండి ఆరు గంటల పాటు కర్ఫ్యూ సడలించింది. మంగళవారం ఈ ప్రాంతాల్లో నాలుగు గంటల పాటు కర్ఫ్యూను సడలించారు.

చురచంద్‌పూర్‌కు చెందిన ఇద్దరు,సరిహద్దు ప్రాంతమైన మోరే నుంచి చిక్కుకుపోయిన 500 మందిని మంగళవారం ఇంఫాల్‌కు తరలించారు. హింసాత్మక ప్రాంతాల నుంచి 4000 మందిని సురక్షిత శిబిరాలకు తరలించారు. ఇక్కడ ప్రజలకు సాధారణ ఆరోగ్య వైద్య, మానసిక సంప్రదింపుల సౌకర్యం కూడా ఇవ్వబడుతుంది.

26,000 మందిని ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించగా, వారిలో ఎక్కువ మంది తమ బంధువుల ఇళ్లలో తలదాచుకున్నారు. హింసాత్మక ప్రాంతాల నుంచి 4000 మందిని సురక్షిత శిబిరాలకు తరలించారు. ఇక్కడ ప్రజలకు సాధారణ ఆరోగ్య వైద్య, మానసిక సంప్రదింపుల సౌకర్యం కూడా ఇవ్వబడుతుంది. 26,000 మందిని ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించగా, వారిలో ఎక్కువ మంది తమ బంధువుల ఇళ్లలో తలదాచుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం