AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur: మణిపూర్ ఇంకా చల్లారని అల్లర్లు.. ఇప్పుడు ఉగ్ర కలకలం

నిన్నమొన్నటి వరకు జాతుల మధ్య వైరంతో అట్టుడికిన మణిపుర్‌లో ఇప్పుడు ఉగ్రవాదం వెలుగుచూడటం కలకలం రేపుతోంది. ఉగ్రవాద నిరోధక సంస్థ అధికారులు చురాచాంద్‌పూర్‌ జిల్లాలోని 25 ఏళ్ల ఓ అనుమానిత టెర్రరిస్టును అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడికి మయన్మార్‌, బంగ్లాదేశ్‌లోని పలు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై పూర్తి స్థాయి విచారణ కోసం అతడిని ఢిల్లీలోని జాతీయ దర్యాప్తు సంస్థ కార్యాలయానికి తీసుకెళ్లారు.

Manipur: మణిపూర్ ఇంకా చల్లారని అల్లర్లు.. ఇప్పుడు ఉగ్ర కలకలం
Manipur
Aravind B
|

Updated on: Sep 30, 2023 | 10:33 PM

Share

నిన్నమొన్నటి వరకు జాతుల మధ్య వైరంతో అట్టుడికిన మణిపుర్‌లో ఇప్పుడు ఉగ్రవాదం వెలుగుచూడటం కలకలం రేపుతోంది. ఉగ్రవాద నిరోధక సంస్థ అధికారులు చురాచాంద్‌పూర్‌ జిల్లాలోని 25 ఏళ్ల ఓ అనుమానిత టెర్రరిస్టును అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడికి మయన్మార్‌, బంగ్లాదేశ్‌లోని పలు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై పూర్తి స్థాయి విచారణ కోసం అతడిని ఢిల్లీలోని జాతీయ దర్యాప్తు సంస్థ కార్యాలయానికి తీసుకెళ్లారు. అయితే ఇటీవలే మణిపుర్‌లో చోటు చేసుకున్నటువంటి సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఆ రెండు దేశాల్లోని ఉగ్రవాద సంస్థలు ప్రయత్నాలు చేశాయని.. అలాగే దీనికి సెయిమిన్‌లన్‌ గ్యాంగ్‌టే (25) సహకరించాడని ఉగ్రవాద నిరోధక సంస్థ ఆరోపణలు చేస్తోంది.

ఇదిలా ఉండగా.. మరోవైపు ఇండియాలో అల్లర్లు సృష్టించడానికి కుట్ర పన్నుతున్న మయన్మార్‌, బంగ్లాదేశ్‌లోని ఉగ్రవాద సంస్థల నాయకత్వంతో గ్యాంగ్‌టేకు సంబంధాలు ఉండే అవకాశాలు ఉన్నాయని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్టు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అలాగే మణిపుర్‌ అల్లర్లను వినియోగించుకునేలా.. కొన్ని రహస్యాలను గ్యాంగ్‌టే వాళ్లకు చేరవేసినట్లు వివరించింది. అలాగే మణిపుర్‌లోని క్వాక్టాలో జూన్‌ 22న కారు బాంబు పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ కేసులో గ్యాంగ్‌టా ప్రధాన నిందితుడు కావడం వల్ల పలు అనుమానాలకు దారితీస్తోంది. అయితే.. ఆ దేశాల్లోని ఏ ఉగ్రవాద సంస్థతో ఇతడికి సంబంధాలు ఉండొచ్చనే విషయాన్ని మాత్రం జాతీయ దర్యా్ప్త సంస్థ ఇంతవరకు వెల్లడించలేదు.

మరోవైపు కుకీ తెగకు చెందిన దాదాపు 25 తిరుగుబాటు గ్రూప్‌లు కూడా చురాచాంద్‌పుర్‌లోనే ఉన్నాయి. అయితే ఈ అల్లర్ల నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, మిలటరీ సాయంతో సస్పెన్షన్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ (ఎస్‌ఓఓ) అనే పేరు మీద ఇటీవల త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అయితే ఇందులో భాగంగానే తిరుగుబాటుదారులు ఆయా సంబంధిత శిబిరాల్లో ఆయుధాలను అందజేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ కూడా కొన్ని గ్రూపులు ఇంకా హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు ఇప్పటికీ బలంగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది మే నెలలో కూకి, మెయిటీ జాతుల మధ్య అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. గిరిజనేతరులైన మెయిటీలు తమకు ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్ చేయడంతో అల్లర్లు ప్రారంభమయ్యాయి. కానీ ఇప్పటికీ అక్కడ ఇంకా ఉద్రిక్తత పరిస్థితులు చల్లారలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

బిగ్ బాష్ లీగ్‌లో తప్పిన పెను ప్రమాదం..వీడియో వైరల్!
బిగ్ బాష్ లీగ్‌లో తప్పిన పెను ప్రమాదం..వీడియో వైరల్!
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ