గూగుల్‌లో నెంబర్లు వెతుకుతున్నారా..? బీ అలర్ట్.. రీఛార్జ్ చేయబోయి రూ.లక్షలు పోగొట్టుకున్న టీచర్..
సైబర్ క్రైమ్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎంత అవగాహన కల్పించినప్పటికీ.. లింకులు, కస్టమర్ కేర్ నంబర్ ద్వారా జరుగుతున్న నేరాలు సంఖ్య పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. చాలా సంస్థలు తమ కస్టమర్ కేర్ నంబర్ కేవలం వెబ్‌సైట్లలో మాత్రమే పొందుపరుస్తున్నాయి.
సైబర్ క్రైమ్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎంత అవగాహన కల్పించినప్పటికీ.. లింకులు, కస్టమర్ కేర్ నంబర్ ద్వారా జరుగుతున్న నేరాలు సంఖ్య పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. చాలా సంస్థలు తమ కస్టమర్ కేర్ నంబర్ కేవలం వెబ్‌సైట్లలో మాత్రమే పొందుపరుస్తున్నాయి. దీంతో కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్‌లో వెతుకుతున్నారు కస్టమర్లు.. ఇదే సైబర్ నేరస్తులకు అస్త్రంగా మారింది. సైబర్ నేరగాళ్లు తమ ఫోన్ నెంబర్‌ను కస్టమర్ కేర్ నంబర్‌గా అభివర్ణించుకుంటూ గూగుల్‌లో రిజిస్టర్ అవుతున్నారు. ఫలితంగా లక్షల కొద్ది రూపాయల నగదును బాధితుల బ్యాంక్ ఖాతా నుంచి కొల్లగొడుతున్నారు. వరుసగా జరుగుతున్న ఘటనలు చూస్తే సైబర్ నేరగాళ్ల సామ్రాజ్యం ఏ స్థాయిలో విస్తరించిందో అర్థమవుతుంది..
తాజాగా ముంబైలో జరగిన ఘటన కలకలం రేపింది. ఆన్లైన్ ద్వారా కస్టమర్ కేర్ నంబర్‌ను శోధించిన ఓ బాధితుడు ఏకంగా తన బ్యాంక్ అకౌంట్ నుంచి 2.4 లక్షల రూపాయల నగదును పోగొట్టుకున్నాడు. తన ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ రీఛార్జ్ చేసేందుకు పలుసార్లు ప్రయత్నించాడు. ఎన్నిసార్లు ప్రయత్నించిన ఎర్రర్ వస్తుండడంతో కస్టమర్ కేర్‌తో మాట్లాడితే తన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావించాడు.. గూగుల్‌లో ఫాస్టాగ్ కస్టమర్ కేర్ నెంబర్ కోసం వెతికాడు. ఆన్లైన్‌లో కస్టమర్ కేర్ నెంబర్ నిజమే చూపిస్తుందని భావించిన బాధితుడు ఆ నంబర్‌కు కాల్ చేశాడు.. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌గా అవతారమెత్తిన సైబర్ నేరగాడు బాధితుడు ఫోన్‌లో రిమోట్ యాక్సిస్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయించాడు. సైబర్ నేరస్థుడు చెప్పిన ప్రాసెస్‌ను బాధితుడు ఫాలో అయ్యాడు. నిమిషాల వ్యవధిలో బాధితుడి బ్యాంక్ ఖాతా నుండి 2.4 లక్షల రూపాయల నగదు డెబిట్ అయ్యింది. ఒక్కసారిగా అంత నగదు డెబిట్ కావటంతో బాధితుడు షాక్‌కు గురయ్యాడు. తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.
బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు సెక్షన్ ల కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 420 ఐపిసి( మోసపూరిత ), ఐటీ యాక్ట్ 66c కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.. ఏదైనా సమస్యకు సంబంధించిన కస్టమర్ కేర్‌తో మాట్లాడాలనుకుంటే నేరుగా సంబంధిత వెబ్‌సైట్ కు వెళ్లి మాత్రమే కస్టమర్ కేర్ నెంబర్ తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గూగుల్ కస్టమర్ కేర్ నంబర్లను ఉపయోగించి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన జూలై 17న జరిగిందని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..