Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amrit Kalash: ‘అమృత్‌ కలాష్‌ యాత్ర’ రైలును ప్రారంభించిన కేంద్ర మంత్రి.. ఇంతకీ యాత్ర ప్రత్యేకత ఏంటంటే..

ఈ రైలు ఒడిశా నుంచి న్యూ ఢిల్లీ వెళ్లనుంది. అయితే కేవలం ఒడిశా నుంచే కాకుండా దేశంలోని పలు ప్రధాన నగరాల నుంచి కూడా ఈ ప్రత్యేక రైళ్లను ఢిల్లీకి నడిపిస్తున్నారు. ఒడిశాలో జరిగిన ఈ రైలు ప్రారంభోత్సవ వేడుకకు బీజేపీ ఎంపీలు.. అపరాజిత సారంగి, ప్రతాప్ సారంగిలతో పాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, రైల్వే అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మాట్లాడుతూ..

Amrit Kalash: 'అమృత్‌ కలాష్‌ యాత్ర' రైలును ప్రారంభించిన కేంద్ర మంత్రి.. ఇంతకీ యాత్ర ప్రత్యేకత ఏంటంటే..
Amrit Kalash Yatra
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 28, 2023 | 2:57 PM

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శనివారం భువనేశ్వర్‌ రైల్వే స్టేషన్‌లో ‘అమృత్‌ కలాష్‌ యాత్ర’ రైలును ప్రారంభించారు. ఒడిశా బీజేపీ అద్యక్షుడు మన్మోహన్ సమాల్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ధర్మేంద్ర ప్రధాన్‌ పచ్చ జెండాను ఊపి రైలును ప్రారంభించారు. ‘నా భూమి.. నా దేశం’ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రత్యేక రైలును నడుపుతున్నారు.

ఈ రైలు ఒడిశా నుంచి న్యూ ఢిల్లీ వెళ్లనుంది. అయితే కేవలం ఒడిశా నుంచే కాకుండా దేశంలోని పలు ప్రధాన నగరాల నుంచి కూడా ఈ ప్రత్యేక రైళ్లను ఢిల్లీకి నడిపిస్తున్నారు. ఒడిశాలో జరిగిన ఈ రైలు ప్రారంభోత్సవ వేడుకకు బీజేపీ ఎంపీలు.. అపరాజిత సారంగి, ప్రతాప్ సారంగిలతో పాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, రైల్వే అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మాట్లాడుతూ.. ‘ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు గ్రామాలు, నగరాల నుంచి మట్టిని సేకరించే ఈ కార్యక్రమం ముగింపు దశకు చేరుకుంటోంది. ఒడిశాలోని ఎన్నో గ్రామాల నుంచి మట్టి సేకరించారు. మట్టితో పాటు 1400 మంది ప్రతినిధులు ఢిల్లీకి బయలుదేరారు

ఇదిలా ఉంటే దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ఎందరో వీరులకు నివాళులర్పిస్తూ, వ్యారి త్యాగాలను స్మరించుకుంటూ.. దేశ రాజధాని న్యూఢిల్లీలో స్మారక శిలాఫలకాలు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆగస్టు 9వ తేదీన నా భూమి, నా దేశం కార్యక్రామినికి కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు.. దేశంలోని మారుమూల గ్రామాలు, పట్టణాల నుంచి పవిత్ర మట్టి, బియ్యంను ఢిల్లీకి 30వ తేదీలోపు తరలించనున్నారు.

మీడియాతో మాట్లాడిన ధర్మేంద్ర ప్రధాన్..

అందులో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు దేశంలోని మారుమూల గ్రామాలు, పట్టణాల నుంచి పవిత్ర మట్టి, బియ్యంను రాష్ట్ర రాజధానులకు ఈ నెల 22 నుంచి 27వ తేదీ లోపుగా తరలిస్తారు. అక్కడ నుంచి ఈ నెల 28 నుంచి 30వ తేదీ లోపు వాటిని దేశ రాజధాని ఢిల్లీకి రవాణా చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి మట్టిని తరలించేందుకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నారు. విజయవాడతో పాటు సికింద్రాబాద్‌ నుంచి ఈరోజు (28వ తేదీ) ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..