వామ్మో ఏంటీ ఈ దారుణం.. భార్యను ఐరాన్ రాడ్ తో కొట్టి చంపిన భర్త

భార్యభర్తల మధ్య గొడవలు వాగ్వాదాలు జరగడం సహజమే. కానీ కొన్ని సార్లు ఈ గొడవలు హద్దుమీరిపోవడంతో ప్రాణాలు కూడా పోతున్నాయి. భర్త..భార్యను చంపడం.. లేదా భార్యే భర్తను హత్య చేయడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

వామ్మో ఏంటీ ఈ దారుణం.. భార్యను ఐరాన్ రాడ్ తో కొట్టి చంపిన భర్త
Death
Follow us
Aravind B

|

Updated on: Apr 01, 2023 | 5:53 PM

భార్యభర్తల మధ్య గొడవలు వాగ్వాదాలు జరగడం సహజమే. కానీ కొన్ని సార్లు ఈ గొడవలు హద్దుమీరిపోవడంతో ప్రాణాలు కూడా పోతున్నాయి. భర్త..భార్యను చంపడం.. లేదా భార్యే భర్తను హత్య చేయడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు అలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే యూపీలోని మహారాజ్ గంజ్ లో హేమంత్ అనే వ్యక్తి తన భార్య ప్రతిభతో కలిసి ఉంటున్నాడు. అయితే హేమంత్ కి మాత్రం తాగుడు అలవాటు ఉండేది. నిత్యం అతను ఇంటికి తాగి రావడంతో తన భార్యకు నచ్చేది కాదు. ఈ అలవాటును మానుకోవాలని ఎన్నోసార్లు అతడ్ని మందలించేది.

కానీ హేమంత్ మాత్రం ఆమె మాటలు పట్టించుకోనేవాడు కాదు. శుక్రవారం రోజున వీళ్లిద్దరికీ గొడవ జరిగింది. ఆ గొడవ తీవ్రతరం కావడంతో హేమంత్ కోపంతో ఐరన్ రాడ్ తో తన భార్యను విచక్షణారహితంగా కొట్టాడు. తీవ్ర గాయాలుపాలైన ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఒక్కసారిగా కంగుతిన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హేమంత్ ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..