Mamata Banerjee: వెస్ట్ బెంగాల్ లో మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న మమతా బెనర్జీ.. ఈరోజు ఆమె ఒక్కరే!

Mamata Banerjee as CM: వెస్ట్ బెంగాల్ లో అద్భుతమైన విజయాన్ని సాధించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత, దీదీ మమతా బెనర్జీ ఈరోజు ఉదయం 10:45 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Mamata Banerjee: వెస్ట్ బెంగాల్ లో మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న మమతా బెనర్జీ.. ఈరోజు ఆమె ఒక్కరే!
Mamata Banerjee
Follow us
KVD Varma

|

Updated on: May 05, 2021 | 7:45 AM

Mamata Banerjee: వెస్ట్ బెంగాల్ లో అద్భుతమైన విజయాన్ని సాధించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత, దీదీ మమతా బెనర్జీ ఈరోజు ఉదయం 10:45 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆమె ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ సాధించారు. ఈరోజు ఆమె ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆమె కేబినేట్ మాత్రం మే 6 లేదా మే 7 న ప్రమాణస్వీకారం చేస్తారు. ఈరోజు జరిగే కార్యక్రమానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ లకు కూడా ఆహ్వానం పంపించారు. మమతా ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజ్ భవన్ టౌన్ హాల్‌లో జరుగుతుంది. దీని తరువాత మమతా బెనర్జీ రాష్ట్ర సచివాలయానికి వెళతారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ సహా ప్రముఖ టీఎంసీ నాయకులు పాల్గొంటారు. వీరే కాకుండా, మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేబ్ భట్టాచార్య, లెఫ్ట్ ఫ్రంట్ నుంచి విమనా బోస్ లను కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు.

ముచ్చటగా మూడోసారి.. మమతా బెనర్జీ మూడోసారి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే, మమతా బెనర్జీ నందిగ్రామ్ సీటు నుంచి ఎన్నికల్లో ఓడిపోయారు. అందువల్ల, 66 ఏళ్ల మమతా బెనర్జీ మళ్లీ సీటు నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది. గతంలో రెండు సార్లూ కూడా ఆమె మే నెలలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మమతా మొదటిసారి ముఖ్యమంత్రిగా 20 మే 2011 న, రెండవసారి 27 మే 2016 న ప్రమాణ స్వీకారం చేశారు.

కాంగ్రెస్, లెఫ్ట్ తరువాత, టీఎంసీ 1950 నుండి వరుసగా 17 సంవత్సరాలు వెస్ట్ బెంగాల్ ప్రజలు కాంగ్రెస్ కు అధికారాన్ని అప్పగించారు. కాని రాష్ట్రం రాజకీయ గందరగోళాన్ని ఎదుర్కొన్నప్పుడు, 1977 లో అక్కడ వామపక్షాలను ఎన్నుకున్నారు. దీని తరువాత, బెంగాల్ లో మొత్తం ఏడు అసెంబ్లీ ఎన్నికలలో వామపక్షాలు వరుసగా విజయం సాధించాయి. సీపీఎం నేతృత్వంలోని వామపక్షాలు అధిక మెజారిటీతో మొత్తం 34 సంవత్సరాలు వెస్ట్ బెంగాల్ ను పరిపాలించాయి. వామపక్షాల నుంచి మమతా బెనర్జీ తృణమూల్ అధికారం సాధించింది. ఆమె గత పదేళ్ళుగా బెంగాల్ ను సౌకర్యవంతమైన మెజారిటీతో పాలించారు. ఈసారి మళ్ళీ ఆమె అధిక మెజారిటీతో తిరిగి ముఖ్యమంత్రి కానున్నారు.

గవర్నర్‌ను కలిసిన మమతా.. మమతా బెనర్జీ మే 3 న పార్టీ శాసనసభ పార్టీ నాయకురాలిగా ఎన్నికయ్యారు. సమావేశం ముగిసిన తరువాత, ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పార్టీ ఆర్భాటాలకు అతీతంగా జరుపుతామని మమతా చెప్పారు. కరోనాపై యుద్ధంలో దేశం విజయం సాధించే వరకు, మేము ఏ ఉత్సవాన్ని జరుపుకోము అని ఆమెచెప్పారు. మే 3 సాయంత్రం మమతా బెనర్జీ గవర్నర్‌ను కలిశారు.

ఆసక్తికరంగా మమతా ప్రమాణ స్వీకారానికి గంగూలీకి ఆహ్వానం..

వెస్ట్ బెంగాల్ లో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ సుప్రీమో మమతా బెనర్జీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అతిధుల జాబితా వెల్లడించారు. ఇందులో పలు ప్రతిపక్ష పార్టీ నాయకుల పేర్లు ఉన్నాయి. రాజకీయ నాయకులే కాకుండా, భారత మాజీ క్రికెట్ టీం కెప్టెన్, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ పేరు కూడా అతిధుల జాబితాలో ప్రస్తావించారు. ఈ జాబితాలో రాజకీయ నాయకులలో కాంగ్రెస్ నాయకుడు ఆదిర్ రంజన్ చౌదరి, మాజీ సిఎం బుద్ధదేబ్ భట్టాచార్జీ, రాష్ట్ర బిజెపి చీఫ్ దిలీప్ ఘోష్ తదితరులు ఉన్నారు. గంగూలీ పేరు ఈ జాబితాలో ఉండడం ఆసక్తికరంగా మారింది.

మమతా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానితులు వీరే! 1. మాజీ సీఎం బుద్ధదేబ్ భట్టాచార్జీ 2. బిమాన్ బోస్ 3. దిలీప్ ఘోష్ 4. అధీర్ రంజన్ చౌదరి 5. మనోజ్ టిగ్గ 6. బిమాన్ బెనర్జీ 7. సుబ్రతా ముఖర్జీ 8. పార్థా ఛటర్జీ 9. ప్రశాంత్ కిషోర్ 10. అభిషేక్ బెనర్జీ 11. దేవ్ (దీపక్ అధికారి) 12. సౌరవ్ గంగూలీ 13. అబ్దుల్ మన్నన్

Also Read: Corona Vaccination: వ్యాక్సిన్ తీసుకున్న వారికి రిల‌య‌న్స్ ఇన్సూరెన్స్ బంప‌రాఫ‌ర్.. వ్యాక్సినేష‌న్‌ను ప్రోత్స‌హించ‌డానికే..

ఈ పంట పండిస్తే లక్షలు సంపాదించవచ్చు..! ఒక్కసారి నాటువేస్తే చాలు.. వరుసగా ఐదేళ్లు పంట వస్తూనే ఉంటుంది..