AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జాతిపిత మహాత్మాగాంధీ పర్సనల్‌ సెక్రటరీ మృతి.. చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత..

Mahatma Gandhi Personal Secretary: భారత జాతిపిత మహాత్మాగాంధీ పర్సనల్ సెక్రటరీగా వ్యవహరించిన వి.కల్యాణం తుదిశ్వాస విడిచారు.

జాతిపిత మహాత్మాగాంధీ పర్సనల్‌ సెక్రటరీ మృతి.. చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత..
Mg Ps Died
Shiva Prajapati
|

Updated on: May 05, 2021 | 8:19 AM

Share

Mahatma Gandhi Personal Secretary: భారత జాతిపిత మహాత్మాగాంధీ పర్సనల్ సెక్రటరీగా వ్యవహరించిన వి.కల్యాణం తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య అనారోగ్య కారణాలతో ఆయన చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. 99 సంవత్సరాల వయస్సు కలిగిన కల్యాణం.. మే 4వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటలకు మృతి చెందినట్టు ఆయన కుమార్తె నళిని వెల్లడించారు.

భారత్‌కు స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత మహాత్మా గాంధీని గాడ్సే కాల్చి చంపినప్పుడు ఘటనా స్థలంలో ఆయనతో పాటు కల్యాణం కూడా ఉన్నారు. అంతేకాదు.. గాంధీజీ హత్యకు కల్యాణం ప్రత్యక్ష సాక్షి కూడా. అయితే కల్యాణం చనిపోయే ముందు గాడ్సే.. గాంధీజీని ఎలా కాల్చారు అనేది హాస్పిటల్‌ సిబ్బందికి వివరించారు కల్యాణం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఇక 1922 ఆగస్ట్ 15న సిమ్లాలో కల్యాణం జన్మించారు. 1944 నుంచి 1948 వరకు గాంధీతో ఆయన కలిసి ఉన్నారని బయోగ్రాఫర్ కుమారి ఎస్ నీలకందన్ తెలిపారు. మహారాష్ట్రలోని సేవాగ్రామ్ ఆశ్రమంలో కల్యాణం ఉన్నారని…. గాంధీకి వివిధ భాషల్లో వచ్చే లేఖల వ్యవహారాలను ఆయన చూసేవారని చెప్పారు.

Gandhi Personal Secretary Video:

Also read:

Corona Virus: కోవిడ్ వ్యాక్సిన్ పట్ల అజాగ్రత్త, నిర్లక్ష్యంతో ప్రాణాలమీదకు తెచ్చుకోకండి.. కీలక సూచనలు చేసిన ఏపీ స్టేట్ నోడల్ ఆఫీసర్..

Petrol-Diesel Price Today: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇవాళ ఇంధన ధరలు పెరిగాయంటే..

Duplicate Numbers: ప్లాస్మా దానం పేరుతో నకిలీ నెంబర్లు.. సోషల్‌ మీడియాలో వందలాది ఫోన్‌ నెంబర్ల లిస్టు