Petrol-Diesel Price Today: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇవాళ ఇంధన ధరలు పెరిగాయంటే..
Petrol-Diesel Price Today: ఇంతకాలం నిలకడగా ఉన్న ఇంధన ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి.
Petrol-Diesel Price Today: ఇంతకాలం నిలకడగా ఉన్న ఇంధన ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 15 పైసలు పెరగ్గా.. లీటర్ డీజిల్‌పై 18 పైసలు పెరిగాయి. దాంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.55 కి చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ. 80.91కి చేరింది. చమురు కంపెనీల అధికారిక సమాచారం ప్రకారం దేశ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. తాజాగా పెరిగిన ధరలతో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.16 లకు చేరింది. అలాగే డీజిల్ ధర రూ.88.25 లకు చేరింది. కరీంనగర్ జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.31 ఉండగా.. డీజిల్ ధర రూ.88.39 లకు చేరింది. మెదక్ జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.84కి చేరింది. డీజిల్ ధర రూ.88.89 లకు చేరింది. నల్లగొండలో లీటర్ పెట్రోల్ ధ రూ. 94.68 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.88.72 గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.16 లకు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ రూ.88.25 లకు లభిస్తోంది. వరంగల్ జిల్లాలో పెట్రోల్ ధర రూ. 93.75 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.87.95 గా ఉంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో చమురు ధరలు పెరిగాయి. ఏపీలో ప్రధాన నగరమైన విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.46కి చేరింది. డీజిల్ ధర రూ.90.4 లకు చేరింది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.73 లకు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ రూ.89.31 లకు లభిస్తోంది. ఇక కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.12 ఉండగా.. డీజిల్ ధర రూ.89.72 గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 96.46 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.90.04 లకు లభిస్తోంది.
దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.55కి చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ.80.91 లకు చేరింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.76 ఉండగా.. డీజిల్ ధర రూ.83.78 గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.95 కు లభిస్తుండగా.. డీజిల్ రూ.87.98 లకు లభిస్తుంది. చెన్నైలోనూ చమురు ధరలు ఇలాగే ఉన్నాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 92.55 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.85.90 గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రో రేట్ రూ. 93.67 గాఉండగా.. డీజిల్ ధర రూ.85.87 గా ఉంది. జైపూర్‌లో లీటర్ పెట్రోల్ కాస్ట్ రూ. 96.84 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.89.32 గా ఉంది.
ఇదిలాఉంటే.. ఇదివరకు వరుసగా నాలుగుసార్లు తగ్గుముఖం పట్టిన చమురు ధరల్లో మళ్లీ పెరుగుదల మొదలయ్యింది. చివరిసారిగా గత నెల 15వ తేదీన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. అప్పటి నుంచి మంగళవారం వరకు ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగుతూ వచ్చాయి. అయితే, తాజాగా దేశ వ్యాప్తంగా ఎన్నికలు ముగియడంతో మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలపై వడ్డన ప్రారంభించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Also read:
Microsoft and Yahoo: మైక్రోసాఫ్ట్ యాహూల మధ్య కుదిరిన ఒప్పందం..గూగుల్ ఆధిపత్యానికి సవాల్..
Horoscope Today: ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త..