Crime News: వీధి కుక్కను కొట్టి చంపిన తండ్రికొడుకు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన

ఒక వ్యక్తి , అతని కుమారుడు కలిసి ఒక వీధి కుక్కను దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌లో శనివారం చోటు చేసుకుంది. వీధికుక్కను చంపిన కేసులో వీరిపై కేసు నమోదు చేసినట్లు సోమవారం ఒక అధికారి తెలిపారు.

Crime News: వీధి కుక్కను కొట్టి చంపిన తండ్రికొడుకు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన
Ulhasnagar
Follow us

|

Updated on: May 31, 2022 | 8:15 AM

Crime News: కుక్కలు, పిల్లులు వంటి జంవుతులను తమ ఇంటి సభ్యులుగా భావించి ఎంతో ఇష్టంగా పెంచుకునేవారు ఉన్నారు. అదే సమయంలో నోరులేని.. మూగజీవులను అకారణంగా హింసించి ఆనందాన్ని పొందేవారు కూడా ఉన్నారు. అయితే ఇలాంటివారు చాలా అరుదుగా మనకు కనిపిస్తారు. తాజాగా రోడ్డుమీద నివసిస్తున్న వీధి కుక్కను దారుణంగా కొట్టి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది పోలీసుల దృష్టికి చేరుకోవడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.

ఒక వ్యక్తి , అతని కుమారుడు కలిసి ఒక వీధి కుక్కను దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌లో శనివారం చోటు చేసుకుంది. వీధికుక్కను చంపిన కేసులో వీరిపై కేసు నమోదు చేసినట్లు సోమవారం ఒక అధికారి తెలిపారు. నివేదికల ప్రకారం.. వీధి కుక్కను దారుణంగా చంపడంలో కొడుకుసహా తండ్రి ప్రమేయం కూడా ఉన్నదని గుర్తించిన పోలీసులు ఇరువురిపై కేసు బుక్ చేశారు.

గురువారం, కుక్కను ఓ వ్యక్తి మొదటిసారిగా కొట్టాడని.. అనంతరం శనివారం అతని కుమారుడు కర్రతో కుక్కపై దాడి చేశాడని తెలుస్తోంది.  ఇరుగుపొరుగువారు ఈ దారుణాన్ని ఆపడానికి ప్రయత్నించారు. అయిన స్థానికులు విఫలమయ్యారు. ఈ ఘటనను కొందరు స్థానికులు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో పలువురు జంతు ప్రేమికులు కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి.. ఆదివారం భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 429 (జంతువును చంపడం లేదా హింసించడం) కింద తండ్రి, అతని కొడుకుపై ఫిర్యాదు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు