MSRTC: ఆ రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో వారికి ఉచిత ప్రయాణం.. మహిళలకు 50 శాతం రాయితీ

మార్చి 9న 2023-24 సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక ప్రణాళికను ప్రవేశపెడుతున్నప్పుడు.. ఆర్ధిక శాఖను నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి..  దేవేంద్ర ఫడ్నవిస్ మహిళల కోసం అంటూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే  మహిళా ప్రయాణికులందరికీ 50% రాయితీని ప్రకటించారు.

MSRTC: ఆ రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో వారికి ఉచిత ప్రయాణం.. మహిళలకు 50 శాతం రాయితీ
Msrtc
Follow us

|

Updated on: Mar 17, 2023 | 2:42 PM

మహిళా ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది మహారాష్ట్ర ప్రభుత్వం. తమ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని రకాల బస్సులలో నేటి నుంచి మహిళా ప్రయాణీకులకు బస్సు టిక్కెట్‌లపై 50% తగ్గింపు ఇస్తున్నామని  స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (MSRTC) సంస్థ ప్రకటించింది.

MSRTC శుక్రవారం ఉదయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో “మహిళా సమ్మాన్ యోజన” కింద మహిళలు అందిస్తున్న ఈ  ప్రయోజనం పొడిగించబడుతుందని పేర్కొంది. ఇలా మహిళలు బస్సు టికెట్స్ లో రాయితీ ఇస్తున్నందనున ఆ రాయితీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం .. ఆర్టీసీ కార్పొరేషన్‌కు తిరిగి చెల్లిస్తుందని పేర్కొంది.

మార్చి 9న 2023-24 సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక ప్రణాళికను ప్రవేశపెడుతున్నప్పుడు.. ఆర్ధిక శాఖను నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి..  దేవేంద్ర ఫడ్నవిస్ మహిళల కోసం అంటూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే  మహిళా ప్రయాణికులందరికీ 50% రాయితీని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మహారాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ లో  15,000 బస్సులు, ఫెర్రీలు కలిసి రోజుకి 50 లక్షల మంది  ప్రయాణికులను రవాణా చేస్తాయి.  అయితే ఇప్పుడు ఈ సంస్థ వివిధ సామాజిక గ్రూప్స్ కి చెందిన టిక్కెట్లపై 33% నుండి 100% వరకు తగ్గింపులను అందిస్తుంది.

అయితే ఇప్పడు ప్రభుత్వం స్త్రీలకు టికెట్స్ లో రాయితీ ఇస్తున్న విషయంపై MSRTC అధికారులు స్పందించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందే మహిళల సంఖ్యను అంచనా వేయడం కష్టమని పేర్కొన్నారు. మహిళా ప్రయాణీకుల్లో నివాసితుల సంఖ్య .. రవాణా వినియోగదారుల్లో  35-40 శాతం పరిధిలో ఉంటుందని MSRTC అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

భారతదేశం 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్‌లకు 100 శాతం రాయితీని..  65 మరియు 74 సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రయాణికులకు అన్ని MSRTC బస్సులపై 50 శాతం తగ్గింపును అందించిన సంగతి తెలిసిందే.

అయితే మనదేశంలో ఆర్టీసీ  బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలకు ఉచిత ప్రయాణాన్ని  ప్రారంభించిన మొదటి ప్రభుత్వం ఢిల్లీలో క్రేజివాల్ సర్కార్.

ఇటీవల కర్ణాటక సీఎం రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది శ్రామిక మహిళలకు ఉచిత బస్ పాస్ సౌకర్యం ప్రకటించారు. సంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళలందరికీ ఉచిత బస్ పాస్‌లు అందించాలని కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..