నడి రోడ్డులో అందరు చూస్తుండగా దారుణం.. కారు చక్రాల కింద నలిగిపోయిన వ్యక్తి..!
మహారాష్ట్రలో దారుణం వెలుగు చూసింది. ఓ మనిషి కారు కింద నలిగిపోయాడు. ఒక్కసారి కాదు.. రెండు మూడు సార్లు.. ఈ ఘోరం.. జనమంతా చూస్తున్నారు. అయినా భయం బెరుకులేకుండా దారుణానికి ఒడిగట్టారు. ముంబై సమీపంలోని థానేలోని వాగ్లే ఎస్టేట్ ఏరియాలో జరిగిందీ అమానుష ఘటన.

మహారాష్ట్రలో దారుణం వెలుగు చూసింది. ఓ మనిషి కారు కింద నలిగిపోయాడు. ఒక్కసారి కాదు.. రెండు మూడు సార్లు.. ఈ ఘోరం.. జనమంతా చూస్తున్నారు. అయినా భయం బెరుకులేకుండా దారుణానికి ఒడిగట్టారు. ముంబై సమీపంలోని థానేలోని వాగ్లే ఎస్టేట్ ఏరియాలో జరిగిందీ అమానుష ఘటన. ఊహించని ఘటన.. వాగ్లేవాసులను తీవ్ర భయబ్రాంతులకు గురిచేసింది.
రాత్రి సమయం కావడంతో ఎవరి ఇళ్లకు.. వాళ్లు పరుగులు పెడుతున్నారు. ఆ టైమ్‌లో ఒక కారు వేగంగా దూసుకొచ్చింది. ముందున్న ఆటోను ఢీకొట్టి మరీ ముందుకెళ్లింది. తీరాచూస్తే కారు కింద ఓ మనిషి ఉన్నాడు. డ్రైవర్ చూసుకోకుండానే ముందుకెళ్తున్నాడని అనుకున్నారంతా. అప్పటికే ఆపు.. ఆపు.. అని చుట్టుపక్కల అరుస్తున్నారు. అవేవీ పట్టించుకోకుండా కారు రివర్స్‌లో వెళ్లి మళ్లీ ముందుకి దూసుకెళ్లింది. ఈ గ్యాప్‌లో కారు టైర్ల కింద పడి చనిపోయారు ఒక వ్యక్తి.
చనిపోయింది గ్యాంగ్‌స్టర్ సంతోష్ పవార్ అలియాస్ సంధ్యగా గుర్తించారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. హత్య చేసింది సంధ్య అనుచరుడిగా అనుమానిస్తున్నారు. పాతకక్షల కారణంగానే హత్య చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. త్వరలోనే మర్టర్ మిస్టరీ ఛేదిస్తామని పోలీసులు తెలిపారు. కారు తొక్కించి చంపేశారని అనుమానిస్తున్నారు. ఆ తర్వాత సీన్ నుంచి ఎస్కేప్ అయ్యారు దుండగులు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం మూడు బృందాలుగా గాలిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




