AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: 40 రోజులు అడవిలో చెట్టుకు బంధీగా అమెరికా మహిళ.. ఇంతకీ ఏం జరిగిదంటే..

అమెరికాలో నివసిస్తున్నప్పుడు ఆమె ప్రసిద్ధ బెల్లీ డ్యాన్సర్, యోగా టీచర్. యోగా రంగంలో కెరీర్‌ను కొనసాగించాలని నిర్ణయించుకుంది. అందుకని యోగాకు సంబంధించిన చదువులు చదవాలనుకుంది. అందుకే భారత్ కు వచ్చింది. యోగా శిక్షణ తీసుకుంటున్న సమయంలో తమిళనాడుకు చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ సమయంలో లలిత తన జీవితాన్ని భారతదేశంలో గడపాలని నిర్ణయించుకుంది.

Maharashtra: 40 రోజులు అడవిలో చెట్టుకు బంధీగా అమెరికా మహిళ.. ఇంతకీ ఏం జరిగిదంటే..
American Woman Found Chaine
Surya Kala
|

Updated on: Jul 30, 2024 | 12:23 PM

Share

మహారాష్ట్రలోని సామంత్‌వాడిలో జరిగిన ఓ ఆశ్చర్యకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. అక్కడ అడవిలో ఒక అమెరికన్ సంతతికి చెందిన 50 ఏళ్ల మహిళ గొలుసుతో చెట్టుకు కట్టబడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళను గొలుసుల నుంచి విడిపించి ఆస్పత్రికి తరలించారు. వెంటనే పోలీసులు అమెరికన్ ఎంబసీకి సమాచారం అందించి విచారణ ప్రారంభించారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన విషయాలు పోలీసుల‌ను సైతంవిస్మయానికి గురిచేస్తున్నాయి. ఈ అమెరికన్ రెసిడెంట్ మహిళను లలితా కై కుమార్ ఎస్ గా గుర్తించారు.

అమెరికాలో నివసిస్తున్నప్పుడు ఆమె ప్రసిద్ధ బెల్లీ డ్యాన్సర్, యోగా టీచర్. యోగా రంగంలో కెరీర్‌ను కొనసాగించాలని నిర్ణయించుకుంది. అందుకని యోగాకు సంబంధించిన చదువులు చదవాలనుకుంది. అందుకే భారత్ కు వచ్చింది. యోగా శిక్షణ తీసుకుంటున్న సమయంలో తమిళనాడుకు చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ సమయంలో లలిత తన జీవితాన్ని భారతదేశంలో గడపాలని నిర్ణయించుకుంది. దీంతో ఆ యువకుడిని వివాహం చేసుకుంది. అయితే ఇప్పుడు అడవిలో సుమారు 40 రోజులుగా బందీగా ఉండడంతో.. ఆకలి, దాహంతో అలమటిస్తున్న లలిత ప్రస్తుతం మాట్లాడేందుకు ఇబ్బంది పడుతోంది.

గొర్రెల కాపరులు మొదట చూశారు

ఇవి కూడా చదవండి

దీంతో పోలీసులకు తన కథంతా రాసి చూపించినట్లు పోలీసులకు చెప్పింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సావంత్‌వాడి తాలూకా సోనురాలి రోనాపాల్‌కు ఆనుకుని ఉన్న అడవిలో బందీగా ఉన్న ఈ మహిళకు విముక్తి లభించింది. అక్కడ ఒక చెట్టుకు ఈ మహిళను ఇనుప గొలుసుతో కట్టి పడి పడేశారు. ఈ స్థితిలో ఉన్న ఆమెను ఆదివారం గొర్రెల కాపరులు చూసి షాక్ తిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తులో భాగంగా ఈ మహిళ మొబైల్ ఫోన్ పరిశీలించగా చాలా విషయాలు స్పష్టమయ్యాయి.. అయితే సంఘటనలకు ఉన్న లింక్‌లు తెలియాల్సి ఉందని అంటున్నారు.

ప్రమాదకరమైన డ్రగ్స్ ఇస్తున్నారని ఆరోపణ

తమిళనాడులో నివసిస్తున్న ఈ మహిళ మహారాష్ట్రలోని సామంత్‌వాడికి ఎలా చేరిందనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. తన భర్త తనను వదిలించుకోవాలని భావిస్తున్నట్లు పోలీసుల విచారణలో మహిళ చెప్పింది. అంతేకాదు తనకు తినడానికి ఆహారం ఇవ్వకుండా ఆకలితో ఉండేలా చేయడమే కాదు.. ప్రమాదకరమైన, తప్పుడు మందులు ఇచ్చి చంపడానికి ప్రయత్నించాడని ఆరోపిస్తుంది. చివరకు తనను తన భర్త ఇక్కడ అడవికి తీసుకొచ్చి కట్టేశాడని చెబుతోంది. చాలా కాలంగా ఆహారం లభించక శారీరకంగా బక్క చిక్కి శక్తిని కోల్పోయిన ఈ మహిళను ఇప్పుడు చికిత్స నిమిత్తం ఒరోస్ జిల్లా ఆసుపత్రికి పోలీసులు తరలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..