Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వ్యూస్ లైక్స్ కోసం ఏ పనైనా చేస్తున్న యువత.. బురదలో నాగిని డ్యాన్స్ వీడియో వైరల్

కొన్ని రకాల వీడియోలు ఆకట్టుకుంటాయి. వీటిని ఇది చూసిన తర్వాత ఒక్కోసారి ఆశ్చర్యానికి లోనవుతారు.. ఇలా ఎందుకు చేస్తున్నారు అని ఒక్కోసారి అనిపిస్తుంది. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం ప్రజల్లో చర్చనీయాంశమైంది. నాగినీ డ్యాన్స్ అంటే ఎంత క్రేజో మనందరికీ తెలిసిందే. పెళ్లిళ్లలో ప్రజలు ఈ నృత్యాన్ని ఉత్సాహంగా చేయడం తరచుగా చూసి ఉంటారు. ఇటీవలి కాలంలో ఇలాంటి వీడియో జనాల్లో చర్చనీయాంశమైంది.

Viral Video: వ్యూస్ లైక్స్ కోసం ఏ పనైనా చేస్తున్న యువత.. బురదలో నాగిని డ్యాన్స్ వీడియో వైరల్
Nagini Dance VideoImage Credit source: X
Surya Kala
|

Updated on: Jul 30, 2024 | 10:52 AM

Share

ప్రస్తుతం రీల్స్ ట్రెండ్ నడుస్తోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా రీల్స్ చేయడానికి ఏదైనా చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని రకాల వీడియోలకు ఆసక్తికర వ్యాఖ్యలు, లైకులు వస్తాయి. దీంతో తము ఇంటర్నెట్ లో చాలా ఫేమస్ అవుతామని భావిస్తున్నారు కూడా. ప్రస్తుతం అందరూ రీల్స్ చేయడానికి ముఖ్య కారణం ఇదే. కొన్ని రకాల వీడియోలు ఆకట్టుకుంటాయి. వీటిని ఇది చూసిన తర్వాత ఒక్కోసారి ఆశ్చర్యానికి లోనవుతారు.. ఇలా ఎందుకు చేస్తున్నారు అని ఒక్కోసారి అనిపిస్తుంది. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం ప్రజల్లో చర్చనీయాంశమైంది.

నాగినీ డ్యాన్స్ అంటే ఎంత క్రేజో మనందరికీ తెలిసిందే. పెళ్లిళ్లలో ప్రజలు ఈ నృత్యాన్ని ఉత్సాహంగా చేయడం తరచుగా చూసి ఉంటారు. ఇటీవలి కాలంలో ఇలాంటి వీడియో జనాల్లో చర్చనీయాంశమైంది. ఒక జంట పాములా మారి నాగిలీ డ్యాన్స్ చేస్తున్నారు. అయితే ఈ నాగిని డ్యాన్స్ ను బురదతో కూడిన పొలంలో చేయడం విశేషం. ఇది చూసి చాలా మంది లైకులు, వ్యూస్ కోసం యువత వీర్రితలలు వేస్తుంది అని కామెంట్ చేస్తున్నారు.

ఇక్కడ వీడియో చూడండి

ఇవి కూడా చదవండి

ఓ జంట బురదలో పాములా డ్యాన్స్ చేయడం వీడియోలో చూడవచ్చు. వీరిని చూస్తుంటే భార్యాభర్తలా అనిపిస్తోంది. వీరి డ్యాన్స్‌ బురదతో నిండిన పొలంలో సాగిపోయింది. ఓ యువ జంట పొలంలో రొమాంటిక్ పోజ్ ఇస్తూ నృత్యం చేయడం ప్రారంభించింది. బురదలో కప్పుకున్న జంట చేసిన ఈ నాగినీ డ్యాన్స్ వీడియో వేగంగా వైరల్ అవుతోంది.

వినయ్ Vk 9351 అనే ఖాతా ద్వారా ఈ వీడియో YouTubeలో షేర్ చేశారు. ఇప్పటి వరకూ ఈ వీడియోను వేల మంది దీనిని చూసి కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒక వినియోగదారుడు లైక్, వ్యూస్ మీద పిచ్చి ప్రజలను వెర్రివాళ్లను చేస్తోందని కామెంట్ చేస్తే, మరొకరు ‘సర్పం ఇలా ఎలా నాట్యం చేస్తుంది’ అని కామెంట్ చేశారు. అంతేకాదు చాలా మంది ఇతర వినియోగదారులు దీనిపై వ్యాఖ్యానించడం ద్వారా తమ అభిప్రాయాన్ని తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..