AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

70 ఏళ్ల మామపై మనసు పడిన 35 ఏళ్ల కోడలు.. భర్తను, పిల్లలను విడిచిపెట్టి వృద్ధుడితో పెళ్లి..

పెళ్లి జరిగిన తర్వాత ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది వినియోగదారులు ఈ వివాహాన్ని వ్యతిరేకించారు. రకరకాల కామెంట్స్ చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. సమాచారం ప్రకారం వృద్ధుడికి ఐదుగురు కుమారులు. కుమారులందరికి పెళ్ళిళ్ళు జరిగాయి. మంచి కుటుంబాలు ఉన్నాయి. అదే సమయంలో వధువైన కోడలకు కూడా భర్త, పిల్లలు కూడా ఉన్నారు.

70 ఏళ్ల మామపై మనసు పడిన 35 ఏళ్ల కోడలు.. భర్తను, పిల్లలను విడిచిపెట్టి వృద్ధుడితో పెళ్లి..
Unique Love
Surya Kala
|

Updated on: Jul 30, 2024 | 9:58 AM

Share

ఉత్తరప్రదేశ్‌లోని మౌలో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక కోడలు తనకు మామయ్య వరసైన వ్యక్తిని పెళ్లాడింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది. 70 ఏళ్ల మామ 10 రోజుల క్రితం తన 35 ఏళ్ల కోడలుతో కలిసి పారిపోయాడు. ఆదివారం అకస్మాత్తుగా ఆలయానికి చేరుకున్న ఇద్దరూ పూలమాలలు వేసుకుని పెళ్లి చేసుకున్నారు. ఈ సమయంలో గ్రామంలోని పలువురు ముఖ్యంగా యువకులు హాజరై వీడియోలు తీస్తూనే ఉన్నారు.

గుడి పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ లోని పోలీసులు ఆలయం దగ్గర ఉన్న జనాలను చూసి అక్కడకు చేరుకున్నారు. అయితే అక్కడ మామ కోడలి పెళ్లి విషయంలో పోలీసులు కూడా జోక్యం చేసుకోకపోవడం ఆశ్చర్యకరం. పెళ్లి జరిగిన తర్వాత ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది వినియోగదారులు ఈ వివాహాన్ని వ్యతిరేకించారు. రకరకాల కామెంట్స్ చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. సమాచారం ప్రకారం వృద్ధుడికి ఐదుగురు కుమారులు. కుమారులందరికి పెళ్ళిళ్ళు జరిగాయి. మంచి కుటుంబాలు ఉన్నాయి. అదే సమయంలో వధువైన కోడలకు కూడా భర్త, పిల్లలు కూడా ఉన్నారు.

అయితే మామ కోడలి మధ్య ప్రేమ వ్యవహారం ఎప్పుడు మొదలైందో ఇరు కుటుంబాల సభ్యుల్లో సహా ఎవరికీ తెలియదు. వీరిద్దరూ ఇంటి నుంచి పారిపోవడంతో వీరి మధ్య ప్రేమాయణం గురించి కుటుంబ సభ్యులతో సహా జనాలకు తెలిసింది. ఈ వింత ప్రేమ పెళ్లి నద్వాసరై ప్రాంతంలోని సరైసాడి గ్రామంలో చోటు చేసుకుంది. 70 ఏళ్ల హరిశంకర్ గ్రామానికి చెందిన కోటేదారు. తన వయసులో సంగం వయసున్న తన కోడలైన వివాహిత పై కన్ను ఎప్పుడు పడిందో.. వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారో తెలియదు.

ఇవి కూడా చదవండి

10 రోజుల క్రితం ఇంటినుంచి పారిపోయిన మామ కోడలు

వీరిద్దరూ 10 రోజుల క్రితం ఇంటి నుంచి కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యులు మామ, కోడలి కోసం చాలా చోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. ఆ తర్వాతే ఇద్దరి మధ్య ఏదో ఉందని జనాలకు అర్థమైంది. ఆ తర్వాత హఠాత్తుగా ఆదివారం ఇద్దరూ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆ మహిళ తలపై చునారీతో పెళ్లికూతురులా నిలబడి ఉన్న వీడియో వైరల్ గా మారింది. పెళ్లి కొడుకైన పెద్దాయన పాలిథిన్‌లోంచి రెండు దండలు తీశారు. ఒక దండను స్వయంగా తీసుకుని మరొకటి వధువుకి ఇచ్చాడు. అనంతరం వారిద్దరూ పూలమాలలు ఒకరి మెడలో ఒకరు వేసుకుని గుడిలో అందరి సమక్షంలో లాంఛనంగా పెళ్లి చేసుకున్నారు.

నుదిటి సింధూరంతో కోడలు

అప్పటికే మహిళ నుదుటిపై సింధూరం దిద్దుకుని ఉంది. పైగా ఆ వృద్ధుడు కూడా తన సంచిలోంచి కుంకుమ తీసి అందరి ముందు ఆ స్త్రీ నుదుటిపై దిద్దాడు. ఈ పెళ్లి జరుగుతున్న సమయంలో పక్కనే ఉన్న యువకులు ఇద్దరికీ సలహాలు ఇస్తూనే ఉన్నారు. ఎవరో మహిళను వృద్ధుడి పాదాలను తాకి నమస్కరించమని చెబుతూనే ఉన్నారు. మరొకరు ఫోటోలకు పోజులివ్వడం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఈ ఘటన సమయంలో అక్కడ ఉన్న అందరూ పెళ్లి మొత్తాన్ని తమ మొబైల్ ఫోన్‌లలో బంధిస్తూనే ఉన్నారు. వృద్ధ మామగారు.. పడుచు కోడలి పెళ్లిని చూసేందుకు భారీ ఎత్తున జనం గుమిగూడారు. పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు కూడా ఆ సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయినా పోలీసులు స్పందించలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..