AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో పాపం.. మరోసారి అతలాకుతలమైన వెనిజులా! భయాందోళనలో ప్రజలు

వెనిజులా ఉత్తర తీరంలో 4.9 తీవ్రతతో మరో భూకంపం సంభవించి, మునుపటి విధ్వంసం నుండి కోలుకుంటున్న ప్రజలలో భయాందోళనలు రేకెత్తించింది. గత భూకంపాలలో 920 మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గల్లంతయ్యారు. శిథిలాల తొలగింపు, సహాయక చర్యలు కొనసాగుతుండగా, అంతర్జాతీయ సహాయం అందుతోంది.

అయ్యో పాపం.. మరోసారి అతలాకుతలమైన వెనిజులా! భయాందోళనలో ప్రజలు
Earthquake Venezuela
SN Pasha
|

Updated on: Jun 27, 2026 | 9:54 AM

Share

వెనిజులా ఉత్తర తీరానికి సమీప సముద్ర ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున 4.9 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఇటీవల చోటుచేసుకున్న భారీ భూకంపాల విధ్వంసం నుంచి దేశం ఇంకా పూర్తిగా కోలుకోకముందే మరోసారి భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తాజా ప్రకంపనల వల్ల అదనపు ప్రాణనష్టం లేదా భారీ ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు వెంటనే వెల్లడించలేదు. అయితే భద్రతా దృష్ట్యా పలు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్త చర్యలు చేపట్టారు.

కొద్ది రోజుల క్రితం వెనిజులాను వరుసగా తాకిన రెండు శక్తివంతమైన భూకంపాలు దేశవ్యాప్తంగా తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 920 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. వేలాది మంది గల్లంతైనట్లు సమాచారం ఉండటంతో సహాయక బృందాలు శిథిలాల వద్ద నిరంతరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. అనేక భవనాలు పూర్తిగా కూలిపోగా, రహదారులు, వంతెనలు, విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. భూకంపాల ప్రభావం ఎక్కువగా నమోదైన లా గువైరా ప్రాంతంలో సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సహాయక వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు సాధారణ ప్రజల ప్రవేశంపై తాత్కాలిక ఆంక్షలు విధించారు. అత్యవసర సేవలు, సహాయక బృందాలు, అధికారులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు కార్యక్రమాలు మరింత వేగంగా కొనసాగుతున్నాయి.

ఈ విపత్తు నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం వెనిజులాకు అండగా నిలుస్తోంది. పలు దేశాలు శోధన, సహాయక బృందాలతో పాటు వైద్య సిబ్బంది, అత్యవసర మందులు, ఆహారం, తాగునీరు, తాత్కాలిక ఆశ్రయ సామగ్రిని పంపిస్తున్నాయి. డజన్ల కొద్దీ అంతర్జాతీయ రెస్క్యూ బృందాలు ఇప్పటికే వెనిజులాకు చేరుకోగా, మరికొన్ని బృందాలు అక్కడికి చేరుకునే ఏర్పాట్లలో ఉన్నాయి. ప్రభుత్వ ప్రతినిధులు అంతర్జాతీయ నాయకులతో సంప్రదింపులు జరిపి సహాయ కార్యక్రమాలపై చర్చించినట్లు వెల్లడించారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అంతర్జాతీయ సహకారం అందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, భూకంపాల అనంతరం చిన్నపాటి ప్రకంపనలు కొనసాగే అవకాశం ఉందని భూకంప నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అధికారుల సూచనలను పాటించాలని, దెబ్బతిన్న భవనాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us